ఎన్నికల్లో అక్రమాలకు చెక్..


Mon,March 25, 2019 01:57 AM

ధర్మపురి, నమస్తే తెలంగాణ:రాబోయే పార్లమెం ట్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అక్రమాలు జరగకుండా అధికార యంత్రాం గం ఏర్పాటు చేస్తోం ది. ఏప్రిల్ 11న జరిగే లోక్‌సభ ఎన్నికలను సీరియస్‌గా తీసుకొని ఆరోపణలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం రెవిన్యూ, పోలీస్ శాఖలు ప్రత్యేక వ్యూ హంతో ముందుకెళ్తున్నాయి. ఇందులో భాగంగానే సీ-విజిల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్‌ను ప్రతీ ఒక్కరూ అండ్రాయిడ్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని అక్రమాల సమాచారాన్ని అధికారులకు అందించే అవకాశం ఉం టుంది. ముఖ్యంగా నగదు, మద్యం పంపిణీలపై పౌ రులు సీ-విజిల్ యాప్ ద్వారా సమాచారం అందిస్తే అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడనుంది. దీంతో పాటు సరిహద్దుల వద్ద గట్టి బందోబస్తు, పెట్రోలింగ్ చేపట్టనున్నారు. అలాగే చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. ఇందుకు తోడు మొబైల్ టీమ్‌లను కూ డా రంగంలోకి దించి అక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇలాంటి పకడ్బందీ ముందు జాగ్రత్త చర్యల కారణంగా ఓటర్లను ప్ర లోభ పెట్టె చర్యలను అరికట్టనున్నారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హ క్కును వినియోగించుకునే విధంగా, ఓటు విలువ-ప్రాధాన్యతను తెలిపేందుకు సంబంధిత అధికారు లు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.

సీ-విజిల్ యాప్..
సీ-విజిల్ పేరిట అధికారులు రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఎన్నికల్లో అక్రమాల నిరోధానికి తోడ్పడుతోంది. దీనిని వినియోగించాలంటే ఆండ్రాయిడ్ ఫోన్ తప్పనిసరిగా ఉండాలి. గుగూల్ ప్లేస్టోర్ నుంచి సీవిజిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. లాంగ్వేజ్ సెలక్ట్ చేసుకొని సెల్‌ఫోన్ నంబర్ ఎంటర్‌చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మన వివరాలు అడుతుంది. పేరు, అడ్రస్, మం డలం, జిల్లా, రాష్ట్రం, పిన్‌కోడ్ నంబర్ నమోదు చేయాలి. అపుడు ఫోటో కెమెరా, వీడియో బొమ్మ లు కనిపిస్తాయి. మనం ఫోటో పంపాలానుకుంటే ఫోటో బొమ్మను, వీడియో పంపాలనుకుంటే వీడి యో బొమ్మను క్లిక్‌చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఓపె న్ కాగానే జీపీఎస్ ఆధారంగా మనం ఉన్న లోకేషన్ నమోదు అవుతుంది. ఈ యాప్‌ను మొబైల్ ఫోన్ నంబర్‌తో గానీ, ఎలాంటి పేరు లేకుండా గానీ యా క్టివేట్ చేసుకోవచ్చు. సీ-విజిల్ యాప్ పనిచేయాలంటే ఇంటర్‌నెట్ బ్యాలెన్స్ ఉండడంతో పాటు, జీపీఎస్ నెవిగేషన్ యాక్టివ్‌గా ఉంటే చాలు.

వీటిపై ఫిర్యాదు చేయవచ్చు..
వివిధ రాజకీయ పార్టీల వారు నగదు, మద్యం పంపిణీ చేయడంతో పాటు ఇతరత్రా బహుమతులు, ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడే సమాచారాన్ని పౌరుల ఈ యాప్ ద్వారా సంబంధిత ఉన్నత శాఖల అధికారులకు చేరవేయవచ్చు. సమ యం ముగిసిన తరువాత ఎన్నికల ప్రచారం, ర్యా లీలు తీస్తుంటే, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలాల్లో పోస్టర్లు వేసినా, బ్యానర్లు కట్టినా లేదా ఏవిధంగానైనా కోడ్ ఉల్లంఘన జరిగినా ఫోటో, వీడి యో తీసీ యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.

100 నిమిషాల్లో సమాధానం..
సమాచారం అందుకునే సదరు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవలసి ఉం టుంది. సీ-విజిల్ యాప్ ఫిర్యాదుల కోసం ప్రతీ జిల్లాకు 24 గంటలూ పనిచేసే డిస్టిక్ కంట్రోల్ సెం టర్(డీసీసీ) ఏర్పాటు చేశారు. సిబ్బంది మూడు షి ప్టులల్లో పనిచేస్తారు. ఆయా జిల్లాల పరిధిలోని అ సెంబ్లీ నియోజకవర్గాల మ్యాప్‌లు కంప్యూటర్లలో ఉంటాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన ప్రలోభాలకు సంబంధించి ఎవరైనా ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయగానే జీపీఎస్ ఆధారంగా డీసీసీలోని కంప్యూటర్ స్క్రీన్ మీద ఏ నియోజకవర్గం పరిధిలోని ఎక్కడ నుంచి ఫిర్యాదు వచ్చిందో కనిపిస్తుంది. డీసీసీ సిబ్బంది దగ్గరలోని ఫ్లయింగ్ స్కాడ్ టీమ్‌కు పంపుతారు. మెజిస్టీరియల్ అధికారులు న్న అధికారి, పోలీస్ ఆఫీసర్, వీడియో గ్రాఫర్‌తో కూడిన ఫ్లయింగ్ స్కాడ్ టీమ్ ఫిర్యాదు వచ్చిన చోటుకెళ్లి పరిశీలిస్తారు. నిజంగానే కోడ్ ఉల్లంఘన జరిగినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా ఆ విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్‌కు రిపోర్టు చేస్తారు. తమకు సమాచారం అందించిన వారి పేర్ల ను గోప్యంగా ఉంచనున్నారు.

పౌరులకు అవగాహన
సీ-విజిల్ యాప్‌పై పౌరులకు అవగాహన కల్పించే చర్యలను చేపట్టారు. ఈ యాప్ వినియోగంపై ఓటర్లకు వివరించనున్నారు. మొన్నటి అసెం బ్లీ ఎన్నికల సందర్భంగా దీనిని అమలులోకి తీసుకొచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో సద్వినియోగం కాలేదు. ఈ సారి మాత్రం ఈ యాప్‌పై విస్తృత ప్రచారం క ల్పించి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేనున్నారు.

రంగంలోకి ముబైల్ బృందాలు..
ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించే వారిపైనా, నగదు, మద్యం పంపిణీ చేయడం, ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయడం లాంటి వ్యవహారాలను పూర్తిస్థాయిలో నిలువరించేందుకు ముబైల్ బృందాలను రంగంలోకి దించుతున్నారు. ఈ బృందాలు ప్రాంతాల వారీగా ఏర్పాటు చేస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్ హోదా ఉన్న అధికారి ఈ మొబైల్‌టీమ్‌లకు నాయకత్వం వహించనున్నారు. అలాగే అనుమానంగా తిరిగే వాహనాలను, వ్యక్తులను మొబైల్ టీమ్‌లు వెంటాడి పసిగట్టనున్నాయి. ఈ విధానాల వల్ల ప్రజలకు ఓటుపై భరోసా లభించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...