గెలుపు టీఆర్‌ఎస్‌దే


Sun,March 24, 2019 12:42 AM

సిరిసిల్ల టౌన్: తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఏవైనా గెలుపుబావుటా ఎగరవేసేది టీఆర్‌ఎస్ పార్టీయేనని టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి భానుప్రసాద్‌రావు ఘంటాపథంగా తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాలిస్టర్ అసోసియేషన్ సంఘం భవనంలో శనివారం నిర్వహిం చిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారసభ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి భారీ మె జార్టీని అందించాలన్న సీఎం కేసీఆర్ పిలుపు మేర కు రేపు(సోమవారం) జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ప్రచార సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యఅతిథులుగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్, పార్లమెంట్ ఎన్నికల నియోజకవర్గ ఇన్‌చార్జి ఈటల రాజేందర్, ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ హాజరవుతున్నారని వెల్లడించారు. అదేవిధంగా 27న ఉదయం 10గంటలకు ముస్తాబాద్ మండల కేంద్రంలో, 29న సాయంత్రం 4గంటలకు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లిలో, 31న ఉదయం 10గంటలకు గంభీరావుపేట మండల కేంద్రంలో సభలు ఉంటాయని తెలిపారు. ఆయా సభలకు భారీ జనసమీకరణ చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. వార్డు అధ్యక్షులు, కౌన్సిలర్లు, స్థానిక నేతలు సమన్వయంతో పని చేసి సభ విజయవంతంలో భాగస్వాములు కావాలన్నారు. ఎంపీ అ భ్యర్థి వినోద్‌కుమార్ విజయం కోసం ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలతో పాటుగా ఎంపీగా వినోద్‌కుమార్ అం దించిన సేవలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని సూచించారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగారావు మాట్లాడుతూ కేంద్రంలో ఏర్పడబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనన్నారు. పార్లమెంట్‌లో అత్యధిక స్థానాలు టీఆర్‌ఎస్ కైవసం చేసుకుని ఢిల్లీలో కీలకపాత్ర పోషించనున్నామని వివరించారు. కేటీఆర్ హాజరుకాబోతున్న ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర సహాయకార్యదర్శి గూడూరి ప్రవీణ్, మున్సిపల్ అధ్యక్షురాలు పావని, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శంకరయ్య, మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్ ఆర్గనైజర్ రేణ, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...