అభివృద్ధిలో భాగమవుదాం..


Sun,March 24, 2019 12:42 AM

వేములవాడ, నమస్తేతెలంగాణ: బంగారు తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో కూడా భాగస్వాములవుదామని వేములవాడ ఎ మ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పిలుపునిచ్చారు. వేములవాడ మండలం వట్టెంల గ్రామానికి చెం దిన పంచాయతీ పాలకవర్గం, రుద్రవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్, సీపీఐనేతలతోపాటు పలువురు యువకులు టీఆర్‌ఎస్‌లో శనివారం చేరా రు. వారికి పార్టీ కండువాలను కప్పి రమేశ్‌బాబు ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ ఉద్యమనేతగా కేసీఆర్ ప్రజాసమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారని, గడిచిన ఐదేళ్లలో సీఎంగా రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించారన్నారు. రైతుబంధు, రైతుబీమా, సాగునీరు ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక సంక్షేమ పథకాలను చేపట్టి దేశానికే ఆ దర్శంగా నిలిచారని కొనియాడారు. రూ.40వే ల కోట్లతో వచ్చే ఐదేళ్లలో గ్రామాల్లో కూడా అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు నిధులను కే టాయించారని గుర్తు చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమా ర్ గెలుపు కూడా ప్రతిఒక్కరూ కృషిచేయాలని పి లుపునిచ్చారు. ఇక వట్టెంల గ్రామానికి చెందిన బీజేపీ అనుబంధ బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి యా మ తిరుపతి, ఉపసర్పంచ్ మంద మల్లేశం, వార్డు సభ్యులు మంద కరణ్, మంద రాజేందర్, పొ న్నం సత్యం, నాయకులు పర్శరామ్, రవి, వెంకటస్వామి, శంకర్, గంగయ్య, దేవయ్యలతో పా టు 50మంది యువకులు పార్టీలో చేరారు. రుద్రవరం గ్రామానికి చెందిన ఊరడి రాజిరెడ్డి ఆధ్వర్యంలో మహేందర్, శ్రీనివాస్, కిషన్‌రెడ్డి, అనుముల మల్లేశం, ఊరడి హారీశ్, కిషన్‌లతో పాటు దాదాపు 70మంది పార్టీలో చేరారు. కార్యక్రమం లో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎర్రం మహే శ్, ఏనుగు మనోహర్‌రెడ్డి, మండల అధ్యక్షులు ఊరడి ప్రవీణ్, గడ్డం హన్మండ్లు, సెస్ డైరెక్టర్ జడల శ్రీనివాస్, పొలాస నరేందర్, గుడిసె విష్ణు, సర్పంచ్ ఊరడి రాంరెడ్డి, ఉపసర్పంచ్ తాడెం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...