వారంలో ఇంటింటికీ భగీరథ నీళ్లు


Sun,March 24, 2019 12:41 AM

కలెక్టరేట్/గంభీరావుపేట/ముస్తాబాద్: రానున్న వారం రోజుల్లో మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి తాగునీ రు అందిస్తామని కలెక్టర్ వెంకట్రామరెడ్డి స్పష్టం చేశారు. సిరిసిల్ల, తంగళ్లపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్ మం డలాల్లో సాగుతున్న పనుల పురోగతిపై సంబంధిత ఉ న్నతాధికారులు, ప్రత్యేక అధికారులు, సిబ్బందితో కలెక్టర్ వేర్వేరుగా శనివారం సమీక్షించారు. ఆవాసం వా రీగా పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. అపరిష్కృ త సమస్యలను ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో పనులు తుది దశకు చేరుకున్నాయని, సమష్టి కృషితో చాలా వరకు వి జయవంతమయ్యామని వివరించారు. మిగిలిన చిన్న చిన్న పనులను వెంటనే పరిష్కరించి తాగునీరు అందించాలని సూచించారు. పనుల నిర్వహణకు ఏర్పాటు చే సుకునే గ్యాంగ్‌లకు అయ్యే ఖర్చులను పంచాయతీల ద్వారా చెల్లించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు క్షేత్రస్థాయిలో అవసరమై న నిధుల ఖర్చుకు వెనుకాడకూడదన్నారు. మండలాలోని టెయిల్ ఎండ్ (చివరి) గ్రామాలకు సరైన ప్రెషర్‌తో భగీరథ గ్రిడ్ తాగునీరు రాకపోవడంవల్ల ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ఒకే రకమైన ఒత్తిడి ద్వారా నీటి సరఫరాను చేపట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన నిపుణులు రానున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు జిల్లాలోని అన్ని గ్రామాలకు నీటి సరఫరా ఉండదని, స మాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

గంభీరావుపేట మండలంలో ఒకే గ్యాంగ్‌తో పనులు చేపట్టడం వల్ల ఆలస్య మవుతున్న దృష్ట్యా వెంటనే అదనంగా మరో నాలుగు గ్యాంగ్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు వాల్వ్ ఆపరేటర్లతో ఎంపీడీవో, మిషన్ భగీరథ అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించి టెయిల్ ఎండ్ టు ఎండ్ విధానం, లాక్ అండ్ సిస్టం ఉద్దేశం, లక్ష్యాన్ని కూలంకషంగా వివరించాలన్నారు. విధులను నిర్లక్ష్యం చేస్తే తీసుకునే చర్యలను వివరిస్తూ తెలుగులో సిద్ధం చేసిన సర్క్యులర్‌లను అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఇతర సమస్యలను పరిష్కరించండి: కలెక్టర్
సిరిసిల్ల పురపాలక సంఘంలో విలీనమైన గ్రామాల్లోని సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎంపీడీవోలతో సోమవారం సమావేశం నిర్వహిం చాలని మున్సిపల్ కమిషనర్ రమణాచారిని ఫోన్‌లో కలెక్టర్ ఆదేశించారు. రాజీవ్‌నగర్‌లో సుమారు 2.5 కిలో మీటర్ల మేర తాగునీటి పాత పైపులైన్ బ్లాక్ అయిందని ఫలితంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని వివరించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించాలని, కొత్త పైపులైన్ కో సం అంచనాలు సిద్ధం చేసి సమర్పించాలని సూచించా రు. మిషన్ భగీరథ పథకం జిల్లాలో తుది అంకానికి చే రుకోవడంలో అన్ని శాఖల సహకారం మరువలేనిదని,కృషి చేసిన ప్రతిఒక్కరిని కలెక్టర్ అభినందించారు. ఆయా సమావేశాల్లో డీఆర్వో ఖీమ్యానాయక్, మిషన్ భగీరథ ఎస్‌ఈ ప్రకాశ్‌రావు, ఈఈలు సురేష్, జానకి, ఏడీ అశోక్‌రావు, డీపీవో శేఖర్, డీటీవో కొండల్‌రావు, డీఆర్డీవో రవీందర్, డీఈ సుమలత, ప్రత్యేక అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి మహ్మద్ అలీ, ఏపీడీ కృష్ణ, డీఎండబ్ల్యూవో సర్వర్‌పాషా, ఎంపీడీవోలు వెంట్రామరెడ్డి, సురేందర్‌రెడ్డి, తహసీల్దార్లు యాకన్న, సుమ, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...