ప్రగతిపథంలో సిరిసిల్ల


Sat,March 23, 2019 01:51 AM

సిరిసిల్లటౌన్: అభివృద్ధిలో సిరిసిల్ల జిల్లా పరుగులు పెడుతున్నదని తెలంగాణ పర్యాటకశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం కొనియాడారు. జిల్లాలో ఆయన శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. మానేరువాగు కరకట్ట పనులను పరిశీలించారు. నెహ్రూపార్కు, బతుకమ్మ ఘాట్, మ్యూజికల్ ఫౌంటేన్, ఇందిరాపార్కులను సందర్శించారు. అక్కడి నుంచి చేనేత పరిశ్రమలోకి వెళ్లి కార్మికులతో ముచ్చటించారు. బతుకమ్మ చీరల తయారీతో వచ్చిన మార్పులను వారిని అడిగి ఆయన తెలుసుకున్నారు. సిరిసిల్ల-కరీంనగర్ రోడ్డులోని కొత్త చెరువు సుందరీకరణ పనులను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం బుర్ర వెంకటేశం మాట్లాడుతూ సిరిసిల్ల అభివృద్ధిలో దూసుకుపోతున్నదని కొనియాడారు. త్వరలోనే సిరిసిల్ల-వేములవాడలు జంటనగరాలుగా పేరుగడిస్తాయని వివరించారు. నెల రోజుల పనిని పది రోజుల్లో పూర్తి చేయించగల సమర్థుడు అని కలెక్టర్ వెంకట్రామరెడ్డిని ప్రశంసించారు. ఆయన వెంట కలెక్టర్ వెంకట్రామరెడ్డి, ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ అంజన్న, డీపీఆర్వో దశరథం, మున్సిపల్ అధికారులు వరుణ్, నవీన్, వెంకటేష్, వినయ్ ఉన్నారు.

రిసెప్షన్ సెంటర్‌లో ఏర్పాట్ల పరిశీలన
కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని పొదుపు భవనంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎంఎల్‌సి నియోజకవర్గ రిసెప్షన్ సెంటర్‌ను పట్టభద్రుల ఎంఎల్‌సి నియోజకవర్గ పరిశీలకుడు బుర్ర వెంకటేశం శుక్రవారం సా యంత్రం తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ రాహుల్‌హెగ్డే, ఆర్డీవో, సహాయ రిటర్నింగ్ అధికారి టి.శ్రీనివాస్‌రావుతో రిసెప్షన్ సెంటర్‌లో ఏర్పాట్లు, భద్రతపై ఆయన చర్చించారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...