అధైర్యపడవద్దు.. అండగా ఉంటాం


Sat,March 23, 2019 01:51 AM

వేములవాడ రూరల్: వడగండ్ల వానతో నష్టపోయిన రైతులెవరూ అధైర్యపడవద్దని, అన్నివిధాలా అండగా ఉంటామని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు భరోసా ఇచ్చారు. వేములవాడ మండలం ఫాజుల్‌నగర్, వట్టెంల, నమిలిగుండుపల్లి, నూకలమర్రి గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. వడగండ్లతో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే రమేశ్‌బాబు మాట్లాడుతూ వడగండ్ల వానతో దాదాపు 700 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదని, చేతికచ్చే దశలో దెబ్బతినడం బాధాకరమని తీవ్ర అవేదన వ్యక్తం చేశారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, ఇప్పుడున్నది అన్నివిధాలా ఆదుకునే తెలంగాణ ప్రభుత్వమని భరోసా ఇచ్చారు. అన్ని పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయాధికారులకు సూచించారు. ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగవద్దని, వాటిల్లిన నష్టాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

అటవీ ప్రాంతంలో పర్యటన
వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటను పరిశీలించేందుకు ఎమ్మెల్యే అటవీప్రాంతంలో పర్యటించారు. ఫాజుల్‌నగర్‌లో పంటను పరిశీలించిన అనంతరం నమిలిగుండుపల్లి శివారులోని అటవీప్రాంతంలో దేవయ్య, చంద్రమౌళితో పాటు మరికొంత మంది రైతులు అటవీప్రాంతంలో వరి పంటను సాగుచేయగా వడగండ్ల వానకు పూర్తిస్థాయిలో పంట దెబ్బతింది. దీంతో రైతులకు మనోధైర్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే రమేశ్‌బాబు అటవీప్రాంతాన్ని కూడా లెక్కచేయకుండా పంటను పరిశీలించేందుకు వెళ్లారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన పర్యటించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ మండలాధ్యాక్షుడు గడ్డం హన్మాండ్లు, సెస్ డైరెక్టర్ జడల శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఎర్రం మహేశ్, ఏనుగు మనోహర్‌రెడ్డి, సర్పంచ్‌లు నాగుల వేణుగోపాల్, పెండ్యాల తిరుపతి, చంద్రగిరి లక్ష్మి, యామ సుమతి, ఏశ తిరుపతి, కట్కం మల్లేశం, ఎంపీటీసీ గొస్కుల రవి, మాజీ సర్పంచ్ లక్ష్మణ్‌రావు, విష్ణు, చెరుకు రవీందర్‌రెడ్డి, ఎండీ రఫీ, యామ తిరుపతి, పొన్నం సత్యం, ఫీర్‌మహ్మద్, శ్రీనివాస్, భాస్కర్‌రావు, మంద రాజేందర్, ఈర్యానాయక్, అంజనీకుమార్, శంకర్‌తో పాటు వ్యవసాయాధికారులు, రెవేన్యూ అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...