నేడే ఎమ్మెల్సీసమరం


Fri,March 22, 2019 02:55 AM

(కరీంనగర్ ప్రతినిధి/రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ);కరీంనగర్ కేంద్రంగా జరుగుతున్న నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మొత్తం 409 పోలింగ్ కేంద్రాలు ఉండగా 63 అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో పట్టభద్రులు, ఉపాధ్యాయుల కలిపి 220 కామన్ పోలింగ్ కేంద్రాలు, పట్టభద్రుల కోసం 219, ఉపాధ్యాయుల కోసం 33 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 430 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, మరో 430 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 250 మంది మైక్రో అబ్జర్వర్లును 409 మంది వెబ్‌కాస్టింగ్ సిబ్బందిని నియమించారు. 1,227 బ్యాలెట్ బాక్స్‌లు ఏర్పాటు చేశారు. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 143 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 54 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాలుకాగా 89 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రెండు నియోజకవర్గాల పరిధిలో కామన్ పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఒకే బ్యాలెట్ బాక్స్ ఏర్పాటు చేశారు. రెండు నియోజకవర్గాల ఓటర్లు ఒకే బాక్స్‌లో ఓట్లు వేయాల్సి ఉంటుంది. పట్టభద్రులకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు తెలుపు, ఉపాధ్యాయులకు సంబంధించి గులాబీ రంగులో ఉంటాయి. ఈ నెల 26న ఓట్లు లెక్కించి, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.

8 గంటల నుంచి పోలింగ్
ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. 1,200 మంది ఓటర్లుకు మించిన పోలింగ్ కేంద్రాల్లో అదనపు సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 900 మంది ఓటర్లకు మించి ఉండకుండా చూశారు. ఈ విధంగా పట్టభద్రుల స్థానానికి సంబంధించిన అదనంగా 63 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటర్లను పరిశీలిస్తే మొత్తం ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో పట్టభద్రుల స్థానంలో 1,35,218 మంది పురుషులు, 61,077 మంది మహిళలు, 26 మంది ఇతరుల చొప్పున మొత్తం 1,96,321 మంది ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15,892 మంది పురుషులు, 7,322 మంది మహిళల చొప్పున మొత్తం 23,214 మంది ఓటర్లు ఉన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చూస్తే 6,289 మంది ఉపాధ్యాయ ఓటర్లు, 80,366 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు.

రెవెన్యూ డివిజన్లలో సామగ్రి పంపిణీ
ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలోని 32 రెవెన్యూ డివిజన్ల పరిధిలో గురువారం ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. విధులు నిర్వహించే ఉద్యోగులు సాయంత్రం కల్లా పోలింగ్ కేంద్రాల్లో రిపోర్ట్ చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు బ్యాలెట్ బాక్స్‌లు పంపిణీ చేశారు. ప్రతి కామన్ పోలింగ్ కేంద్రంలో ఆరుగురు, ప్రతి ప్రత్యేక పోలింగ్ కేంద్రంలో నలుగురి చొప్పున ఉ ద్యోగులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. 220 కామన్ పోలింగ్ కేంద్రాల్లో 1,320 మంది, 33 ఉపాధ్యాయ, 219 పట్టభద్రులు కలిపి 252 ప్రత్యేక పోలింగ్ కేంద్రాల్లో 1,008 మంది సిబ్బంది చొప్పున మొత్తం 2,328 మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. వీరు కాకుండా మరో 1,500 మంది రెవెన్యూ ఉద్యోగులు ఇతర విధులు నిర్వహిస్తున్నారు.

ప్రతి పోలింగ్ కేంద్రానికి భద్రత కోసం ఒక కానిస్టేబుల్ లేదా హెడ్ కానిస్టేబుల్‌తోపాటు ఒక హోం గార్డును నియమిస్తున్నారు. అలాగే ఏసీపీ లేదా డీఎస్పీ స్థాయి అధికారులతో శాంతి భద్రతల పర్యవేక్షణ జరుగుతోంది. సీఐలు, ఎస్‌ఐల ఆధ్వర్యంలో ప్రత్యేక పోలింగ్ పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను కరీంనగర్‌లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూంలకు తరలిస్తారు.

కేంద్రాలకు తరలిన సిబ్బంది
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పొదుపు భవన్‌లో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు సిబ్బం ది గురువారం సాయంత్రమే కేంద్రాలకు తరలివెళ్లింది. జిల్లాలో 14 కేం ద్రాలు ఏర్పాటు చేశారు. సి బ్బంది 78 మంది కోసం 14 ప్రత్యేక స్కూల్ బ స్సులను కేటాయించారు. ఉదయం నుంచే సిబ్బందితో సామగ్రి పం పిణీ కేంద్రంలో జేసీ యాస్మిన్ బాషా, ఆర్డీఓ శ్రీనివాస్ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. బ్యాలెట్ పెట్టెలను, సామగ్రిని తీసుకొని సిబ్బంది, పోలీసు లు సాయం త్రం నాలుగు గంటలకే పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. మంచినీటి వసతి, ప్రాథమిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

ఏర్పాట్లను పరిశీలించిన జేసీ..
ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై జేసీ యాస్మిన్ బాషా పర్యవేక్షించారు. పొదుపు భవనంలోని పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రంలో సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని సూచించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ కోసం వీడియో, వెబ్ కాస్టిం గ్‌తో పాటు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపా రు. పీవోలు, ఏపీవీలు పక్కాగా విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సిబ్బంది పో లింగ్ కేంద్రాలలోనే ఉండాలని ఆదేశించారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...