ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం


Fri,March 22, 2019 02:54 AM

వేములవాడ, నమస్తే తెలంగాణ: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు వేములవాడ నియోజకవర్గం, బోయినపల్లి మండలాల్లో 9 పోలింగ్ కేంద్రాలను ఓటర్ల కోసం అధికారులు సిద్ధం చేశారు. శుక్రవారం ఎన్నికలకు పోలిం గ్ నిర్వహించనుండగా అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. పట్టభద్రులు 4197, ఉపాధ్యాయు లు 266మంది ఓటర్లుండగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ను నిర్వహించనున్నారు. సాధారణ ఎన్నికల్లో అడిగిన గుర్తింపుకార్డులనే ఈ ఎన్నికల్లోనూ అధికారులు వాటిని పరిగణలోకి తీసుకోనుండగా పోలింగ్ బూత్‌లోకి సెల్‌ఫోన్లు అనుమతి లేవని ఇప్పటికే తేల్చిచెప్పారు. నియోజకవర్గంలోని 5 మండలాలు, చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలంలోని ఓటర్ల వారీగా పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ మండలాలకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలిం గ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈరెండు మండలాల్లో పట్టభద్రులు 1891 ఓటర్లుండగా, రెండు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.

ఉపాధ్యాయ ఓటర్లు 150 మంది ఉండగా వీరికి ఒక పోలింగ్ బూత్‌తో కలిపి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 3 పోలింగ్ కేంద్రాలు, కోనరావుపేట మండలంలో పట్టభద్రులు 658, ఉపాధ్యాయులు 77 మంది ఓటర్లు ఉండగా వీరికి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రుద్రంగి, చందుర్తి మండలాల్లో కలిపి పట్టభద్రులు 665, ఉపాధ్యాయులు 23మంది ఓటర్లు ఉండగా చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలంలో పట్టభద్రులు 983, ఉపాధ్యాయులు 16 మంది ఓటర్లుండగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం పట్టభద్రులు 4197, ఉపాధ్యాయులు 266మంది ఓటర్లు ఉన్నారు.

4 గంటల వరకు పోలింగ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునేవారికి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే అనుమతిని ఎన్నికల అధికారి ఇచ్చారు. సాధారణ ఎన్నికల్లో ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపుకార్డులనే ఈ ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్లు అందులో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకొని రావాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్లను అనుమతించలేదని ఎన్నికల అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.

బ్యాలెట్‌పై ఓటుహక్కును వినియోగించుకోవాలి
ఎన్నికల అధికారులు అందజేసిన బ్యాలెట్‌పై మాత్రమే అంకెల రూపంలో ఓటుహక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇందులో 1 నుం చి అంకెలను ఎవరికైతే ఓటువేస్తారో వారికి వరుస సంఖ్యలో ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. సంతకాలు ఇతర త్రా ఉన్నట్లయితే చె ల్లని ఓట్లుగా పరిగణిస్తామని అధికారులు వెల్లడించారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...