రంగ్ బర్‌సే..


Fri,March 22, 2019 02:53 AM

సిరిసిల్ల రూరల్: సిరిసిల్ల పట్టణంతోపాటు మండలాల్లో గురువారం హోలీ సంబురాలను ఘనం గా జరుపుకున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఒకరిపైఒకరూ రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. యువకులు మిత్రుల ఇళ్లకు వెళ్లి రంగులు చల్లుకుంటూ, బైక్‌లపై కేరింతలు కొడుతూ రోజంతా ఆనందంగా గడిపారు.

సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల్లో గురువారం హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, నాయకులు రంగులు పూసుకోని వేడుకలు జరుపుకున్నారు. పోలీస్‌ష్టేషన్‌కు తరలివెళ్లి ఎస్‌ఐ శేఖర్‌కు రంగులు పూసి, హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్, పడిగెల రాజు, పెద్దూరి తిరుపతి, లకా్ష్మరెడ్డి, వేముల శ్రీనివాస్, మోర రాజు, భానుమూర్తి, మల్లేశం ఉన్నారు.
గంభీరావుపేట: మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో ప్రజలు గురువారం హోలీ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా యువకులు నృత్యాలు చేస్తూ, ఒకరిపైఒకరు రంగులు చల్లుకుని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఎల్లారెడ్డిపేట: మండలంలోని పలు గ్రామాల్లో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే యువత, చిన్నారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు రంగులను పూసుకుని వేడుకలు జరుపుకున్నారు. ఠాణాలో కానిస్టేబుళ్లు, సిబ్బం, సీఐ రవీందర్, ఎస్‌ఐ ప్రవీణ్‌తో కలిసి రంగుల పండుగలో ఆనందాన్ని ఆస్వాదించారు. కొంతమంది యువకులు రంగునీల్ల బాటిళ్లతో ఒకరిపై మరొకరు చల్లుకుంటూ తడిసిముద్దయ్యారు. బైక్‌లపై కేరింతలు చేస్తూ వీధివీధినా ఉత్సాహంగా గడిపారు.
ఇల్లంతకుంట: మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో యువకులు, యువతులు, హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అన్ని గ్రామాల్లో హోలీ వేడుకల్లో సర్పంచులు పాల్గొని యువతకు ఉత్సాహాన్నిచ్చారు. మండల కేంద్రంలో ఎస్‌ఐ చంద్రశేఖర్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గొడుగు తిరుపతి, ముస్కానిపేటలో ఎంపీపీ గుడిసె ఐలయ్య, పొత్తూరులో జడ్పీటీసీ సిద్దం వేణు, సోమారంపేటలో సెస్ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి, రేపాక సీతారామాంజనేయ ఆలయ ఆవరణలో మహిళలు, యువతులు వేడుకలు జరుపుకున్నారు.
వీర్నపల్లి: మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ప్రజలు వీధుల్లోకి వచ్చి ఒకరిపైఒకరు రంగులు చల్లుకుంటూ సంబురాలు జరుపుకున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా వేడుకల్లో పాల్గొన్నారు. అడవిపదిరలో అర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ ఎడ్ల సాగర్, భూక్యతండాలో పార్టీ మండలాధ్యక్షుడు శ్రీరాంనాయక్, వీర్నపల్లిలో ఏఎంసీ వైస్ చైర్మన్ రాజేశ్‌బాబు, గ్రామాల్లో సర్పంచులు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
సిరిసిల్ల కల్చరల్: సిరిసిల్ల పట్టణంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలోమార్కండేయ ఆలయంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ రంగులు చల్లుకుని సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షురాలు సామల పావ ని, సామల దేవదాస్, పద్మశాలీ సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ, మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, టీఆర్‌ఎస్ నేత ఆడెపు రవీందర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ముస్తాబాద్: మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో గురువారం హోలీ పండగను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండే యువతీ యువకులు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వ్యాపార వాణిజ్య సంస్థలు ఉదయం వేళల్లో మూసిఉంచారు. యువకులు వివిధ వాహనాల్లో మిత్రుల గృహాలకు వెళ్లి రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...