రైతులు ఆందోళన చెందవద్దు


Fri,March 22, 2019 02:53 AM

బోయినపల్లి: అకాల వర్షం, వడగళ్లు పడడంతో పం టలను నష్టపోయిన రైతులెవరూ ఆందోళన చెంద వద్ద ని, ప్రభుత్వ పరంగా బాధితులను అన్నివిధాలా ఆదు కుంటామని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ భరోసా ఇచ్చారు. బుధవారం సాయంత్రం పడిన అకాల వర్షం తో వడగళ్లకు మండలంలోని మల్కాపూర్, అనంతపల్లి, తడగొండ గ్రామాల్లో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. ఆయా గ్రామాల్లో చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌తో కలసి ఎంపీ వినోద్ గురువారం పర్య టించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టం జరిగిన పలువురు రైతులు ఎంపీ, ఎమ్మెల్యేకు తమ గోడువెల్లబోసుకున్నారు. తమను ఆదుకోవాలని కోరారు. బాధిత రైతులను వా రు ఓదార్చారు. అన్నివిధాలా ఆదుకుంటామని భరో సా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ వినోద్ మా ట్లాడు తూ మండలంలో సుమారు 600 ఎకరాల్లో పంట న ష్టం వాటిల్లిందని వివరించారు. వాటిల్లిన పంట నష్టా న్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

తాను గత 25 ఏళ్ల నుంచి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలను చూడలేదని వాపోయారు. యాసంగి పంట ఇంటికి చేరే సమయంలో తెలంగాణలో ఏప్రిల్, మే నెలలో ఎప్పుడూ ఆకాల వర్షం, వడగళ్లు పడి నష్టం వాటిల్లు తుందని వివరించారు. లక్షలాది రూపాయలు పెట్టు బడి పెట్టి పండించిన పంట పూర్తి దెబ్బ తిని నేల పాలు కావడం అత్యంత బాధాకరమని, ఏ రైతుకు అటువంటి కష్టం రావద్దని ఆవేదన చెందారు. ఈ వడగళ్ల వాన విషయం ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటను వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను క్షేత్రస్థాయి సర్వేకు పంపించారని వెల్లడించారు. జరిగిన పంట నష్టంలో ఎంత మంది రైతులకు పంట ఇన్సూరెన్స్ ఉందో అధికారుల ద్వారా తెలుసుకుంటామని తెలిపారు. బీమా ఉన్న పంటలకు వచ్చే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు. ఇన్సూరె న్స్ లేని రైతుల విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీ సుకెళ్తామని, వారందరికీ న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం స్థానిక ఎవో ప్రణీతతో మాట్లాడగా ప్రాథమికంగా 600 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అంచనా వేసినట్లు ఎంపీకి ఆమె వివరించారు. అనంతరం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ఆరు గాలం కష్టపడి పండించిన పంట వడగళ్లతో నేల పాలు కావడం బాధా కరమని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం విషయ మై బుధవారం సాయంత్రమే కలెక్టర్, ఆర్డీవోలతో మా ట్లాడినట్లు వెల్లడించారు. పంటలు దెబ్బతిని నష్టపోయి న రైతులెవరూ ఆందోళనకు గురి కావద్దని హామీ ఇచ్చారు. సమగ్ర నివేదికతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని రైతుల పక్షాన కోరుతామని ఆయన భరోసా ఇచ్చారు. వారివెంట డీసీఎంఎస్ చైర్మన్ ము దుగంటి సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, వైస్‌ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, సర్పంచులు కోరేపు నరేష్, చిందం రమేశ్. సత్యానారాయణరెడ్డి, కోరెం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నా యకులు చెన్నాడి అమిత్‌రావు, కత్తెరపాక కొండ య్య, ఎనుగుల కనుకయ్య, సుధాకర్, స త్యనారాయణరెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులున్నారు.

అనంతపల్లిలో పంటల పరిశీలన..
అనంతపల్లిలో వడగళ్లతో దెబ్బతిన్న పంటలను ఎ మ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత చెన్నాడి సుధాకర్‌రావు పరిశీలించారు. బుధవారం సాయంత్రం వడగళ్లు పడి అనంతపల్లిలో భారీ మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్‌రావులు గురువారం క్షేత్రస్థాయిలో పంటలను పరీశీలించారు. ఈ సందరర్భంగా రైతులకు కంట తడి పెట్ట గా వారిని ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుంది ఎవరూ అధైర్య పడవద్దని చెప్పారు. వారివెంట వైస్ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, సర్పంచ్ వంగపల్లి సత్యనారాయణరెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు చెన్నాడి అమిత్‌కుమార్, కత్తెరపాక కొండయ్య, జంగ సత్యం, గడ్డం తిరుపతిరెడ్డి, డబ్బు వెంకట్‌రెడ్డి తదితరులున్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...