ఎన్నికలను సజావుగా నిర్వహించాలి


Fri,March 22, 2019 02:53 AM

కలెక్టరేట్: కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా, సజావు గా నిర్వహించాలని సంబంధిత అధికారులకు జేసీ యాస్మిన్‌బాషా సూచించారు. జిల్లా కేంద్రంలోని పొ దుపు భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జేసీ గురువారం సందర్శించారు. పోలింగ్ అధికారులకు ఎమ్మెల్సీ ఎన్నికల సామగ్రి పం పిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అంతకుముందు పోలింగ్ అధికారులతో జేసీ యాస్మిన్‌బాషా సమావే శం నిర్వహించారు. సజావుగా ఎన్నికలను నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చా రు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు శుక్రవారం ఉదయం 8.00 గంట ల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 14 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వాటిలో పట్టభద్రుల కోసం ప్రత్యేకంగా 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 9 ఉమ్మడి పోలింగ్ కేంద్రాలు (ఉపాధ్యాయులు, పట్టభద్రులకు కలుపుకుని) ఏర్పాటు చేశామన్నారు.

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు పోలింగ్ ప్ర క్రియ కేంద్ర ఎన్నికల నిబంధనల మేరకు జరుగుతుం దో? లేదో? పరిశీలించేందుకు పోలింగ్ ప్రక్రియ ప్రా రంభం నుండి ముగింపు వరకు వీడియోగ్రఫీ, వెబ్‌క్యాస్టింగ్ చేస్తున్నామన్నారు. సూక్ష్మ పరిశీలకులు సై తం పోలింగ్ తీరును పరిశీలిస్తారన్నారు. సూక్ష్మ పరిశీలకులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. సూక్ష్మ పరిశీలకులు పోలింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పీవోలు, ఏపీవోలు పక్కాగా విధులు నిర్వర్తించేలా చూడాలని ఆదేశించారు. ఈ సారి కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం పోలింగ్‌కు సంబంధించి సూక్ష్మ పరిశీలకుల రిపోర్ట్ రిటర్నింగ్ అ ధికారికి పంపి వారు అంగీకారం తెలిపితేనే మెటీరియ ల్ స్వీకరణ ఉంటుందన్నారు. పోలింగ్ ముగిసేంత వరకూ ఎన్నికల సిబ్బంది కేంద్రాల్లో ఉండాలన్నారు. అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను రిటర్నింగ్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుందన్నారు. పో లింగ్ కేంద్రాల వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో ఆర్డీవో, సహాయ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్‌రావు, జోనల్ అధికారులు, తహసీల్దార్లు, పీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...