వైభవంగా రథోత్సవం


Fri,March 22, 2019 02:52 AM

చందుర్తి : బండపల్లిలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరుడి రథోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. వివిధ పూలు, పత్రాలతో అ లంకరించిన రథంపై స్వామివారి ఉత్సవ మూ ర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. మంగళవాయిద్యాలు, భజనల మధ్య రథం ఊరేగింపు కొనసాగింది. మం గళ నీరాజనాలతో మహిళలు స్వాగతం పలికారు. పసుపు, కుంకుమలతో పాటు పూలు పత్రీలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. గురువారంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కాగా సర్పంచ్ న్యాత విజయజార్జ్, ఉప సర్పంచ్ కాసారపు గంగాధర్, ఆలయ చైర్మన్ గడ్డం అంజిరెడ్డి, నాయకులు కట్కం మల్లేశం, ముస్కు మల్లారెడ్డి, కొండ లక్ష్మణ్, గడ్డం రూపేశ్‌రెడ్డి, గడ్డం తిరుపతిరెడ్డి, వికృతి శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, గంప పవన్, మల్యాల గంగనర్సయ్య, ఎన్వీ సాగర్ రాజు, పల్లి ప్రవీ ణ్, ఎనుగుల లచ్చిరెడ్డి, మామిడి రాము లు, కట్కం చంద్రయ్య, తాటిశెట్టు తిరుపతిరెడ్డి, గ్రా మ ప్రమఖులు, వార్డు సభ్యులు, భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...