ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తాం


Fri,March 22, 2019 02:52 AM

చందుర్తి : వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందకు అన్ని చర్యలు తీసుకుంటున్నామనీ, ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేయాలని సీఐ విజయ్ కుమార్ పిలుపు నిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో చందుర్తి, మూడపల్లిలో గురువారం సాయంత్రం కేంద్ర సాయుధ బలగా ల (సీఏపీఎఫ్)తో కలిసి కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతిఒక్కరూ నిర్భయంగా ఓటు వేయాలని కోరారు. అవాంఛనీయ సంఘటనలకు పా ల్పడుతూ శాంతిభత్రలకు విఘాతం కలిగిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. తమ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని సర్కిల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సర్కిల్‌లోని పలు సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక బలగాలతో నిఘా పెట్టినట్లు తెలిపారు. సుమారు 50 మంది పోలీసులతో కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ నీలం రవి, సిబ్బంది పాల్గొన్నారు.

20
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...