మహిళలు చైతన్యవంతులు కావాలి


Thu,March 21, 2019 01:07 AM

సిరిసిల్ల కల్చరల్ : మహిళలు చైతన్యవంతులు కావాల ని రాష్ట్ర తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. బుధవారం వాసవి కల్యాణ మండపంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సాధికారితపై సందేశం ఇచ్చారు. పూర్వకాలంలో మహిళలు వంటింటికే పరిమితమై బయటి ప్రపంచం కూడా తెలియకుండా ఉన్నారు. ఆధునిక కా లంలో మహిళలు శక్తివంతులై ఎన్నో వివిధ రంగాలలో వాళ్ల సత్తా చూపిస్తున్నారని తెలిపారు. మహిళలపై చిన్న చూపు వదులుకోవాలని చెప్పారు. ఇప్పుడున్న సమాజంలో పు రుషులు ఎదగడమే చాలా కష్టమని, అలాంటిది మహిళలు వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలకు వెళ్తున్నారని సూచించారు. పురుషులతోపాటు మహిళలు కూడా సమాన స్థాయిని పొందడమే మహిళా సాధికారతని చెప్పారు. అనంతరం కరీంనగర్ జడ్పీటీసీ తుల ఉమ, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, 7వ వార్డు కౌన్సిలర్ పత్తిపాక పద్మ, జిల్లా మోటర్ వె హికిల్ ఇన్‌స్పెక్టర్ ప్రమీల, వేములవాడ కిడ్జ్ హైస్కూల్ కరస్పాండెంట్ దరక్షన్ వసీఫియా, కవయిత్రి బూర రా జేశ్వరి, సీనియర్ పారిశుధ్య కార్మికురాలు బాలవ్వలను శాలువా, మెమొంటోలతో సన్మానించారు. కార్యక్రమం లో తెలంగాణ గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆయాచిత్రం శ్రీధర్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎర్రోజు శ్రీనివాస్, గౌరవ సలహాదారుడు నర్సింహారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు జయంతి, జిల్లా తెలంగాణ వికాస సమితి అధ్యక్షులు రామినేని ఫణిరాజారావు, జిల్లా కో-ఆర్డినేటర్ కొ లనూరు శేఖర్‌రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ నాగుల శ్రీనివాస్‌గౌడ్, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...