పేదలకు వరం.. నేత్ర వైద్యశాల


Thu,March 21, 2019 01:06 AM

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ : జిల్లా ప్రజలకు త్వరలో ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో కంటి వైద్య సేవలు అందనున్నాయి. ఎ మ్మెల్యే, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర త్యేక చొరవతో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన ఏ ర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఇందుకు సి రిసిల్లలోని ఆర్డీఓ కార్యాలయం ముందు గల 30 గుంటల స్థలాన్ని ఎంపిక చేశారు. రూ.10 కోట్లతో జీప్లస్ వన్ విధానంతో అధునాతన భవన నిర్మా ణం చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు రూ పొందిస్తున్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ మేనేజర్ జీఎన్‌రావు వారం క్రితం స్వయంగా సిరిసిల్లకు వచ్చా రు. కలెక్టర్ వెంకట్రామరెడ్డితో కలిసి స్థలాన్ని పరిశీలించారు. త్వరలో భూమి పూజ చేసి పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతుండగా, జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాపై ప్రత్యేక దృష్టి..
తెలంగాణ ప్రభుత్వం పేదలకు మెరుగైన వై ద్యం అందించడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నది. ఇప్పటికే జిల్లా ప్రధాన వైద్య శాలను అధునికీకరించడానికి రూ. 259 కోట్లతో 300 పడకల కార్పొరేట్ దవాఖానను మంజూరు చేసింది. కిడ్నీ వ్యాధి గ్రస్థులకు ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తున్నది. నెలకు రూ.20 నుంచి రూ.30 వేల ఖ ర్చు అయ్యే వైద్యం ఉచితంగా లభిస్తున్నది. బ్లడ్ బ్యాంకు, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ల పథకాలతో వి విధ సేవలందిస్తున్నది. కార్మిక, ధార్మిక క్షేత్రాల ప్ర జలందరికీ కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. కంటి వెలుగులో నేత్ర పరీక్షలు నిర్వహించింది.

కంటి దవాఖానకు అడుగులు..
జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే కేటీఆర్ మరో కానుక ఇచ్చారు. ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన ఏర్పాటు కు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఖ్యాతి గడించిన ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ సేవలు జిల్లా ప్రజలకు త్వరలో అందనున్నాయి. కేటీఆర్ సూచనల మేరకు దవాఖాన మేనేజర్ జీఎన్ రావు వారం క్రితం సిరిసిల్లకు వచ్చారు. కలెక్టర్ వెంకట్రామరెడ్డిని ఆయన కార్యాలయంలో కలుసుకుని హాస్పిటల్ ఏర్పాట్లపై సమీక్షించారు. భవన నిర్మాణానికి అవసరమయ్యే 30 గుంటల స్థలాన్ని స్థాని క ఆర్డీఓ కార్యాలయం వద్ద వారు పరిశీలించారు. ఆ స్థలం అనుకూలంగా ఉండడంతో దవాఖానకు కేటాయించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అధునాతన భవన నిర్మాణానికి రూ.10 కోట్లు అంచనా వేశారు. తొలుత గ్రౌండ్ ఫ్లోర్‌తో ఒక అంతస్థు ని ర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కా ర్పొరేట్ స్థాయిలో నిర్మించనున్న ఈ హాస్పిటల్‌లో హైదరాబాద్‌లోని పెద్ద పెద్ద దవాఖానల్లో లభించే వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి.

అందుబాటులో వైద్య సేవలు ..
జిల్లాలోని పేదలు కంటి ఆపరేషన్లు చేయించుకునేందుకు కరీంనగర్‌లోని రేకుర్తి, హైదరాబాద్‌లోని సరోజినీ దేవి, ఎల్వీ ప్రసాద్ లాంటి దవాఖానలకు వెళ్తున్నారు. నాలుగు గంటల ప్రయాణంతో దూర, ఆర్థిక భారమవుతున్నది. అపరేష న్లు చేయించుకున్న తర్వాత మళ్లీ వారం రోజులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలంటే పేషంట్లు ఇ బ్బందులు పడుతున్నారు. కంటి వెలుగు వైద్య శి బిరంలో ఆపరేషన్లు అవసరమని గుర్తించిన వా రిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ జిల్లాలో ప్రత్యేకంగా ఎల్వీ ప్రసాద్ దవాఖాన ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. ము ఖ్యంగా నేత, బీడీ, భవన నిర్మాణ రంగ కార్మికులు కంటి పరీక్షలు ప్రైవేటులో చేయించుకోవాలంటే ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నారు. మో తె బిందు ఆపరేషన్లు, లేజర్, తదితర చికిత్సలు చే యించుకునే ప్రజలకు ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశా ల వరంగా మారనున్నది. ప్రపంచ స్థాయి నాణ్య తా ప్రమాణాలతో త్వరలో జిల్లాకేంద్రంలో ఏర్పా టవుతున్న దవాఖానలో పేదలకు ఉచితంగా నేత్ర వైద్య సేవలందనున్నాయి. దీంతో జిల్లా ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...