కనుల పండువగా డోలోత్సవం


Wed,March 20, 2019 02:36 AM

-వేములవాడలో ఘనంగా కామదహనం
-శాస్ర్తోక్తంగా నిర్వహించిన అర్చకులు
వేములవాడ కల్చరల్ : త్రిరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం రాత్రి డోలోత్సవ కార్యక్రమం కనుల పండువగా నిర్వహించారు. కామ దహనం తర్వాత నుంచి శివకల్యాణ మహోత్సవం వరకు 3 రోజులపాటు త్రిరాత్రోత్సవాలు, డోలోత్సవం నిర్వహించడం అనాదిగా వస్తున్నది. ఈ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయ అద్దాల మండపంలో వేదపండితులు ఆలయ ఉత్సవమూర్తులను పల్లకిలో కూర్చుండబెట్టి డోలోత్సవం నిర్వహించారు. ఆగమశాస్త్రం ప్రకారం రాజన్న ఆలయంలో ఈ డోలోత్సవం కార్యక్రమాన్ని పున్నమికి ముందు రోజు నిర్వహించడం ఆనవాయి తీ. కార్యక్రమంలో ఆలయ ఈవో దూస రాజేశ్వర్, ప్రధా న అర్చకులు ప్రధానార్చకులు ఈశ్వరగారి సురేశ్, ఉప ప్రధానార్చకులు చంద్రగిరి శరత్, గోపన్నగారి నాగన్న, గ ణేశ్, శివప్రసాద్, మామిడిపెల్లి శరత్, వేదపండితులు గర్శకుర్తి శ్రీధరశర్మ, ఉపాధ్యాయ, ఆంజనేయశర్మ స్వామివారికి డోలోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఘనంగా కామదహనం..
త్రిరాత్రోత్సవాల్లో భాగంగా వేములవాడ రాజన్న ఆలయం ముందు కామదహన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వేదపండితులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కామదహనం జరిగిన స్థలం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేశారు. ఈ కామదహన కార్యక్రమాన్ని లోకకల్యాణార్థం నిర్వహిస్తారని పండితులు పేర్కొంటున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో దూస రాజేశ్వర్, మున్సిపల్ వైస్‌చైర్మన్ ప్రతాప రామకృష్ణ, ఆలయ అర్చకులు, వేదపండితులు, పురప్రముఖులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...