వైభవంగా వేంకటేశ్వరుడి కల్యాణం


Wed,March 20, 2019 02:34 AM

చందుర్తి : బండపల్లిలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణం మంగళవారం వైభవంగా, జరిగింది. వివిధ రకాల పూలు పత్రాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వేకువజామున శ్రీవారి మేల్కొలుపు అనంతరం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామివారి ఉత్సవమూర్తుల విగ్రహాలనుంచి పంచామృతాభిషేకాలు, అగ్నిప్రతిష్ఠ, ధ్వజకుంభారాధణ, పూర్ణాహుతి, తీర్థప్రసాద వితరణ ఇత్యాది క్రతువులు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు కొదంబిల్ల శ్రీకాంతచారి ఆధ్వర్యంలో వేదపండితుల బృందం మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కల్యాణం జరిగింది. సర్పం చ్ న్యాత విజయజార్జ్ పట్టువస్ర్తాలు, ఆలయ చైర్మన్ గడ్డం అంజిరెడ్డి ముత్యాల తలంబ్రాలు సమర్పించగా మాజీ సర్పంచ్ గడ్డం పద్మా తిరుపతిరెడ్డి అన్నదానం చేశారు. పలు గ్రామాలనుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. రాజన్న ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్, ఎంపీపీ తిప్పని శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ అల్లాడి రమేశ్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మరాఠి మల్లిక్, సర్పంచులు లింగంపల్లి సత్తయ్య, ఐల్నేని కమలాకర్‌రావు, గట్టు లక్ష్మీ నారాయణ, నాయకులు కొండ లక్ష్మణ్, వరి భూమయ్య, అంచె రాంరెడ్డి, ముస్కు ముకుందరెడ్డి, కాసారపు గంగాధర్, కట్కం మల్లేశం, ముస్కు మల్లారెడ్డి, విక్కుర్తి శ్రీనివాస్, గడ్డం రూపేశ్‌రెడ్డి, గంప పవన్, పల్లి ప్రవీణ్, ఏనుగుల లచ్చిరెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, మ్యాకల మల్లేశం, దర్శనాల ఆంజనేయులు, బుర్ర శ్రీనివాస్ గౌడ్, మ్యాకల రాజేశం, కోరె మల్లేశం, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...