సేవాలాల్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి


Wed,March 20, 2019 02:34 AM

-టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు న్యాలకొండ రాఘవరెడ్డి
కోనరావుపేట : సంత్ సేవాలాల్ స్ఫూర్తితో గిరిజనులు ఉన్నత స్థానాలకు ఎదగాలని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు న్యాలకొండ రాఘవరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలో నూత న గ్రామ పంచాయతీగా ఏర్పడిన గోవిందరావుపేట తండాలో గిరిజనులు సంత్ సేవాలాల్ బోగ్ బండార్ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బంజారులు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా, బోగ్ బండార్ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం రాఘవరెడ్డి మట్లాడుతూ మహారాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం శుభపరిణామన్నారు. బం జారుల అభివృద్ధికి, వారి సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందకు సేవాలాల్ మహరాజ్ విశేష కృషి చేశారన్నారు. గత ప్రభుత్వాలు గిరిజన సంక్షేమాన్ని విస్మరించగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో గిరిజన అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని ఆయన పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి సేవాలాల్ వద్ద హోమం నిర్వహించగా ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు రజిత, ఎంపీటీసీ పద్మ, ఉపసర్పంచ్ ప్రకాశ్ నాయక్, సెస్ డైరెక్టర్ తిరుపతి గోర్ సిక్వాడి జిల్లా అధ్యక్షుడు రాజు నాయక్, సర్పంచులు కెంద గంగాధర్, రాములు నాయక్, కలికోట సర్పంచ్ ధరావత్ సరోజ సీతారాం, మాజీ జడ్పీటీసీ నర్సయ్య, వార్డు మెంబర్లు సరిత, రజిత, బుజ్జి, సీతారాం, సుగుణ, గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...