అభ్యర్థుల వ్యయాన్ని పకడ్బందీగా లెక్కించాలి


Wed,March 20, 2019 02:33 AM

-ఎన్నికల వ్యయ పరిశీలకుడు శేఖర్ ఎస్ చౌహన్
- అధికారులతో సమీక్ష
కలెక్టరేట్: ఎన్నికల్లో అభ్యర్థులు చేసే వ్యయా న్ని పకడ్బందీగా లెక్కించాలని కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని మానకొండూర్, వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల సెగ్మెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకుడు శేఖర్ ఎస్ చౌహన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకుని కలెక్టరేట్‌లో జేసీ యాస్మిన్‌బాషాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు విషయాలపై జేసీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని సమావేశహాల్‌లో సహాయ రిటర్నింగ్ అధికారు లు, అకౌంటింగ్ అధికారులు, ఫ్లయింగ్ స్కాడ్, ఎంసీఎంసీ బృందాలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రచారానికి ప్రదర్శించే హోర్డింగులు, కరపత్రా లు, బ్యానర్లు, బహిరంగ సభలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారాన్ని కూడా పరిశీలిస్తూ ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయాలని చెప్పారు. మూడు సెగ్మెంట్ల పరిధిలో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరించాలని సూచించారు.

అభ్యర్థుల ఖర్చులపై పూర్తిస్థాయి నిఘా ఉంచాలన్నారు. ఏవైనా సందేహాలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల ఏర్పాట్లు, సిబ్బంది నియామకం, ఫ్లయింగ్ స్కాడ్, సర్వీలెన్స్ టీమ్, వీడియో సర్వలైన్ టీం తదితర వివరాలను వ్యయ పరిశీలకుడికి జేసీ వివరించారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు చేరుకున్న శేఖర్ ఎస్ చౌహన్‌కు జేసీ, డీఆర్‌వో ఖిమ్యానాయక్, జిల్లా అడిట్ అధికారి బి.స్వప్న పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. సమావేశం లో డీఆర్వో ఖిమ్యానాయక్, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, జిల్లా ఆడిట్ అధికారి బి.స్వప్న, డీసీవో మహ్మద్‌అలీ, డీపీఆర్వో మామిండ్ల దశరథం పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...