ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి


Wed,March 20, 2019 02:33 AM

వేములవాడ, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని జిల్లా పోలీస్ అధికారులతో ఎన్నికల వ్యయ పరిశీలకులుగా శేఖర్ ఎస్ చౌహన్ అన్నారు. మంగళవారం ఆయన హరిత హోటల్‌లో ఎస్పీ రాహుల్‌హెగ్డే, వేములవాడ, సిరిసిల్ల డీఎస్పీలతో సమావేశమయ్యారు. సమస్యాత్మక ప్రాంతాలు ముందుగానే గుర్తించి, ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నగదు రవాణాపై ప్రత్యేక దృష్టిసారించాలనీ, జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. అనుమానితులపై దృష్టిసారించి, భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతామనీ, తీసుకుంటున్న భద్రత చర్యలపై ఎస్పీ ఎన్నికల వ్యయ పరిశీలకుడికి వివరించారు. సమావేశంలో వేములవాడ డీఎస్పీ పి.వెంకటరమణ, సిరిసిల్ల డీఎస్పీ ఎన్.వెంకటరమణ ఉన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...