చంద్రశేఖర్‌గౌడ్‌కు అవకాశమివ్వాలి


Wed,March 20, 2019 02:33 AM

ఇల్లంతకుంట: పట్టభధ్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌కు అవకాశమివ్వాలని జడ్పీటీసీ సిద్దం వేణు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో టీఆర్‌ఎస్ పార్టీ రాజకీయ శక్తిగా ఎదగాలంటే, రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులే విజయం సాధించాలన్నారు. అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు మామిం డ్ల చంద్రశేఖర్‌గౌడ్ విజయానికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ దొంతి మల్ల య్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చల్ల నారాయణ, ఎంపీటీసీ భాస్కర్, పొత్తూరు సర్పంచ్ సిద్దం శ్రీనివాస్, ఉపసర్పంచ్ సాదుల్,బాలరాజు, మీసరగండ్ల అనిల్, సిద్దం నర్సయ్య, చం దన్, రమేశ్, మొండయ్య, స్వామి పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ను గెలిపించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ షబ్బీర్‌అలీ అన్నారు. మంగళవా రం మండల కేంద్రంలోని గాయత్రి కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన చంద్రశేఖర్‌గౌడ్‌కు మొదటి ప్రాధాన్యగా ఓటెసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు శ్రావణ్, లక్ష్మీకాంత్, రాజు, కిషన్‌గౌడ్, రమేశ్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...