పారదర్శకంగా విధులు నిర్వర్తించాలి


Wed,March 20, 2019 02:33 AM

-జేసీ యాస్మిన్‌బాషా
-ఎన్నికల నిర్వహణపై పీవోలకు శిక్షణ
కలెక్టరేట్: కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల విధులను అధికారులు పారదర్శకంగా నిర్వర్తించాలని జేసీ యాస్మిన్‌బాషా అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణం కుసుమ రామయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సిరిసిల్ల నియోజకవర్గ సెగ్మెంట్ విధుల్లో కేటాయించిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ యాస్మిన్‌బాషా మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అన్ని విషయాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు వంద శాతం శ్రద్ధతో విధులు నిర్వహించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరికి ఈవీఎంలపై అవగాహన కల్పించాలన్నారు. పోలింగ్ రోజున తొలి రెండు గంటల్లో చాలా పోలింగ్ కేంద్రాల్లో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని చెప్పారు. ఇందులో ఎక్కువగా ఈవీఎంలను సరిగా బిగించకపోవడంతో వచ్చిన సమస్యలే ఉన్నాయని పేర్కొన్నారు. మాక్‌పోలింగ్‌కు ముందే ఈవీఎంలను హడావుడిగా కాకుండా, సరిగా బిగించాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్‌పోలింగ్ నిర్వహించాలని సూచించారు. అధికారులు పంపిణీ చేసిన ఓటరు స్లిప్పులతోపాటు ఎన్నికల కమిషన్ గుర్తించిన 12రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకుని వస్తేనే ఓటర్లను ఓటెసేందుకు అనుమతించా లన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఎంత పోల్ అయిందో ఉన్నతాధికారులకు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో టి.శ్రీనివాస్‌రావు, మాస్టర్ శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...