నేడు మహిళలకు ఆత్మీయ సన్మానం


Wed,March 20, 2019 02:32 AM

-తెవిస జిల్లా అధ్యక్షుడు రామినేని ఫణిరాజారావు
సిరిసిల్ల కల్చరల్: ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో బుధవాం ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు రామినేని ఫణిరాజారావు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక వాసవి కల్యాణ మండపంలో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్, విశిష్ట అతిథులుగా ఆయాచితం శ్రీధర్, ఎర్రోజు శ్రీనివాస్, నర్సింహరెడ్డి, డాక్టర్ జయంతిరామ పాల్గొంటారని చెప్పారు. మహిళా సాధికారితపై సందేశం ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి నాగుల శ్రీనివాస్ గౌడ్, మండల కోఆర్డినేటర్ నడిమెట్ల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి వడ్నాల శేఖర్ పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...