కిడ్నీ బాధితులకు పునర్జీవం


Tue,March 19, 2019 03:20 AM

-రాష్ట్రంలోనే సిరిసిల్లలో మొదటి డయాలసిస్ సెంటర్
-కేటీఆర్ చొరవతో జిల్లా వైద్యశాలలో ఏర్పాటు
-అందుబాటులో అధునాతన పరికరాలు.. వైద్యనిపుణులు
-రోగులకు తప్పిన ఆర్థిక భారం, దూరప్రయాణం
-పేదలకు ఊరటస్తున్న రక్తశుద్ధి కేంద్రం
-ఇప్పటి వరకు 6,828 మందికి చేకూరిన ప్రయోజనం
-పేద, మధ్య తరగతి వర్గాల్లో సర్వత్రా హర్షం
మానవ దేహంలోని మలినాలను, వ్యర్థాలను వడగట్టి బయటికి పంపడంలో మూత్రపిండాలే ముఖ్య పాత్రను పో షిస్తాయి. జీవక్రియలో అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తా యి. కిడ్నీలు పనిచేయకపోతే శరీరమంతా ఉబ్బిపోతుంది. మ నిషి ఉన్నట్లే కాని ఏ పని చేయాలన్నా శరీరం సహకరించదు. జీవశ్చవంలా పడి ఉండాల్సిందే. ఆ తరుణంలో ఒక్కటే మా ర్గం. కిడ్నీలు మార్చుకోవడం.. లేదంటే డయాలసిస్ చేయించుకోవడం. ఆ రెండూ అత్యంత ఖర్చుతో కూడుకున్నవే. ఆ ఆధునిక వైద్యం నిన్నామొన్నటి వరకు పేదలకు అందని ద్రాక్షే. ఫలితంగా ఎంతోమంది పేదలు, మధ్యతరగతి ప్రజలు అర్ధాంతరంగా ప్రాణాలను విడుస్తున్నారు. వాతావరణ కాలుష్యం. ఆధునిక ఆహార అలవాట్లు కావచ్చు.

రక్తంలో క్రియాటిన్ పెరిగి మూత్ర పిండ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. మూత్ర పిండం ప్రాణగండంగా మారుతున్నది. అవగాహనలోపం, ఆర్థిక లేమితో గ్రామీణుల్లో ఎక్కువ శాతం ఆర్‌ఎంపీ, పీఎంపీల వద్ద చికిత్స చేయించుకుంటున్నారు. ఫలితంగా వ్యాధి ముదిరి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నా రు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నది. ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని మౌలిక వసతులను కల్పిస్తూ మెరుగైన వైద్యసేవలను అందించేందుకు శ్రీకారం చుడుతున్నది. అందులో భాగంగా రాష్ట్రవాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని వైద్యశాలల్లో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయగా అందులో సిరిసిల్లలోనే తొలి కేంద్రం కావడం విశేషం.

డయాలసిస్ అంటే..
సాధారణంగా శరీరంలోని రక్తాన్ని మూత్రపిండాలు శుద్ధి చేసి వ్యర్థాలను బయటకి పంపిస్తాయి. అవి కిడ్నీలు పనిచేయడం మానేస్తే వ్యర్థాలు రక్తంలోనే పేరుకుపోయి ప్రాణాలకే ముప్పు వాటిల్లు తుంది. అలాంటి వారికి కృత్రిమంగా యంత్రపరికరాల ద్వారా రక్తాన్ని శుద్ధి చేయడమే డయాలసిస్ అంటారు. వ్యాధిగ్రస్తులు వారానికి రెండు లేదా మూడు సార్లు తప్పక చేయించు కోవాల్సి ఉంటుంది. ఇది జీవితాంతం కొనసాగించాల్సి ఉండడమేగాక చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక్కసారి వైద్యం చేయించుకోవాలంటే కనీసం రూ. 3వేల నుంచి రూ. 4వేల చొప్పున నెలకు రూ. 20వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో..
ఇప్పటివరకు డయాలసిస్ చేయించుకోవాలంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులంతా ప్రైవేట్ వైద్యశాలలనే ఆశ్రయించాల్సి వచ్చేది. అదీగాక అందుకు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఆర్థిక స్థోమత లేని వాళ్లు ఆ ఖరీదైన వైద్యం కోసం ఇల్లు, పొలాలు ఆస్తులు అమ్ముకోవడం, పలువురు మృత్యువాత పడిన సంఘటనలు జిల్లాలో అనేకమున్నాయి. ఈ నేపథ్యంలో పేద, మధ్యతరగతి వర్గాల కిడ్నీ వ్యాధిగ్రస్థుల ప్రాణాలను కాపాడేందుకు తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రధాన వైద్యశాలల్లో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించగా ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక చొరవ తొలి కేంద్రాన్ని సిరిసిల్లలోనే ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలో 2017 ఆగస్టులో 22న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డితో కలిసి కేటీఆర్ ఆ సేవలను అందుబాటులోకి తీసుకురాగా నాటి నుంచి ఆ సెంటర్ వేలాది మంది ప్రాణాలను కాపాడుతూ పునర్జన్మను ప్రసాదిస్తున్నది.

అధునాతన పరికరాలు..
జిల్లా కేంద్రంలోని వైద్యశాలలో రూ. కోటి నిధులతో డయాలసిస్ సెంటర్‌ను 5 బెడ్లతో ఏర్పాటు చేశారు. అధునాతన టెక్నాలజీ గల మిషన్లు, జనరేటర్లు, రోగులకు శుద్ధజలం అందించేందుకు ప్లాంట్‌ను ప్రత్యేకంగా నెలకొల్పారు. కేంద్రంలోని ప్రతి బెడ్డుకూ డయాలసిస్(రక్తశుద్ధి) చేసే యంత్రాన్ని సమకూర్చారు. కేంద్రం నిర్వహణ బాధ్యతలను జర్మనీకి చెందిన డీమెడ్ హెల్త్ కేర్ సంస్థకు సర్కారు అప్పగించింది. సెంటర్‌లో ఒక వైద్యుడితో పాటు నిత్యం నలుగురు సిబ్బంది, ఆరుగురు టెక్నీషియన్లు వైద్యసేవలను అందిస్తున్నారు. రక్తశుద్ధికి వాడే డయాలైజర్ విలువ రూ. 800ల నుంచి ఉంటుంది. అది ఒక రోగికి వాడిన తర్వాత ప్రైవేట్ హాస్పిటళ్లలో మరో రోగికి వినియోగిస్తుంటారన్న ఆరోపణలున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఒకరికి వాడిన డయాలైజర్ మరోకరికి ఎట్టి పరిస్థితిలో వినియోగించుకుండా దాని స్థానంలో కొత్తది వినియోగిస్తుండడం అభినందనీయం.

6,828 వేల మందికి సేవలు..
జిల్లావైద్యశాలలోని డయాలసిస్ కేంద్రం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వరంగా మారింది. కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా రోగులకు మెరుగైన వైద్యసేవలను అందిస్తూ పేదల మన్ననలను పొందుతున్నది. కేంద్రానికి రోజుకు 20మంది వరకు వచ్చి వారానికి రెండు సార్లు వచ్చి డయాలసిస్ చేయించుకుంటున్నారు. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ వైద్యం చేయించుకుంటున్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన నాటి నుంచి గడిచిన రెండు సంవత్సరాల్లో ఇప్పటి వరకు 6,828 మంది లబ్ధిపొందారు. అందులో 18ఏళ్ల వయసున్న యువకుల నుంచి మొదలుకొని 75ఏళ్ల వయసున్న వృద్ధుల వరకు ఉన్నారు. ఒక్కో రోగికి రూ. 20ల చొప్పున జర్మనీకి చెందిన డీమెడ్ సంస్థకు ప్రభుత్వం నెలనెలా చెల్లిస్తున్నది. కేంద్రం నిర్వహణలో ఎలాంటి రాజీలేకుండా ఆ సంస్థ రోగులకు సేవలందిస్తుండడంతో వ్యాధిగ్రస్తులు ప్రశంసిస్తున్నారు. కేటీఆర్ మాకు దేవుడంటూ కొనియాడుతున్నారు.

షెడ్యూల్ ప్రకారం పరీక్షలు..
జిల్లా వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం రోగులకు సౌకర్యవంతంగా ఉంది. చాలా మంది పరీక్షల కోసం ఇక్కడికే వస్తున్నారు. పేర్లు నమోదు చేసుకుని ఏ రోజు రావాలన్నది ముందుగానే వారికి సూచిస్తున్నాం. దీంతో అందరికీ వైద్య పరీక్షలు అందించగలుగుతున్నాం. వైద్యశాల సిబ్బంది సహకారమూ తీసుకుంటున్నాం. డయాలసిస్ కిట్‌ను ప్రతీ పేషెంట్‌కు మారుస్తున్నాం.
- నరేష్, టెక్నీషియన్

కేటీఆర్ దయతోనే వైద్యం..
నాలుగేళ్లుగా డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్న. ఈ సమస్యతో ఏ పనీ చేయలేని దుస్థితి. డబ్బులు లేక వైద్యం కోసం మస్తు తిప్పలు పడ్డా. సర్కారు దవాఖాన్ల పరీక్షలు అందుబాటులోకి వచ్చాక నాలెక్క ఎంతోమంది ఇక్కడే పరీక్షలు చేయించుకుంటున్నారు. పేదవారికి చాలా ఉపయోగకరంగా ఉంది. కేటీఆర్ అన్న దయతోనే నాకు ఇక్కడ వైద్య సేవలు అందుతున్నాయి.
- పరకాల మహేశ్, అనంతనగర్, సిరిసిల్ల, వ్యాపారి

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...