నేడు వేంటేశ్వరస్వామి కల్యాణం


Tue,March 19, 2019 03:17 AM

చందుర్తి : బండపల్లిలోని ప్రహ్ల్లాద కొండపై వెలిసిన శ్రీలక్ష్మి వేంకటేశ్వర స్వామివారి బ్రహోత్సవాలలో భాగంగా నేడు (మంగళవారం) కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. వేకువజామున స్వామివారి మేలుకొలుపు, హారతి, మహాయగ్నం తదితర పూజల అనంతరం ఉదయం 10: 15 నిమిషాలకు స్వామివారి కల్యాణం కన్నుల పండువుగా జరుగనుంది. 21న శ్రీవారి రథోత్సవం, జాతరలు జరుగనున్నాయి. కల్యాణానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొనున్నారు. నేడు 18న సోమవారం ఉదయం 5 గంటల నుంచి 8 గం టల వరకు శ్రీవారి మేలుకొలుపు, నిత్యారాధన, 8 గంటల నుంచి 12 గం టల వరకు విశ్వక్షేమారాదన, చతుస్థానర్చన, అగ్నిప్రతిష్ఠ, హోమం, పూర్నాహుతి, ఆరగింపు, తదితర పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ న్యాత విజయజార్జ్, ఉప సర్పంచ్ కాసారపు గంగాధర్, ఆలయ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి, విక్కుర్తి శ్రీనివాస్, పల్లి ప్రవీణ్, గంప పవన్, రాములు, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...