వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన


Tue,March 19, 2019 03:17 AM

రుద్రంగి: వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారంపై అవగాహన పెంచుకోవాలని తహసీల్దార్ మహ్మద్ తఫాజుల్ హు స్సేన్ అన్నారు. పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం రుద్రంగి మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలతో కలిసి మహిళలకు, గర్భవతులకు పోషణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మహ్మద్ తఫాజుల్ హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీలలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సకల వసతులు కల్పిస్తుందన్నారు. ప్ర భుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య బోధిస్తున్నారని తెలిపారు. అనంతరం అంగన్‌వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో పోషణ్ అభియాన్‌పై చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించామని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, అంటువ్యాధుల నివారణ, బాల్యవివాహల నిర్మూలనపై విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించామని చెప్పారు. గర్భవతులకు శ్రీమంతాలు, 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన, 3 సంవత్సరాల చిన్నారులకు సా మూహిక అక్షరాభ్యాసం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు గడప జ్యోతి, కొమురె మంజుల, టి. శారద, ఎస్.అనసూయ, ఎ.కవిత, ఎ.సరిత, రజిత, వసంత, సునిత, ఆశ కార్యకర్త సరితలతో పాటు గర్భవతులు, ఆరు నెలలు పిల్లల తల్లులు, మహిళలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...