ఆరోగ్య తెలంగాణే లక్ష్యం


Tue,March 19, 2019 03:16 AM

కోనరావుపేట: ఆరోగ్య సమాజ నిర్మాణ కోసం తెలంగాణ ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమం చేపట్టిందని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నిర్మల దేవి అన్నారు. సోమవారం మండలంలోని మామిడిపల్లి, బావుసాయిపేట గ్రామాలలో పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు సీమంతాలు, పెరటి తోట పెంపకం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా నిర్మలదేవి మాట్లాడుతూ పోషక విలువతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఎటువంటి ఆహారం తీసుకోవాలో వారికి అవగాహన కల్పించారు. కొలనూర్ గ్రామంలో అంగన్‌వాడీ టీచర్లు పోషణ్ అభియాన్ ద్వారా బాల్య వివాహాలు, పరిశుభ్రపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో ఆర్‌బిఎస్‌కే వైద్యురాలు కృష్ణవేణి, వైద్యుడు రాజశేఖర్, అంగన్‌వాడీ టీచర్లు మాధవి, వెంటకటరమాదేవి, కనకలక్ష్మి, సునీ, స్వప్న, లక్ష్మి, పద్మ, సునీత, మల్లీశ్వరీ, గీత, సీసీ రవి, వీవోఏలు సునీత, మంజుల, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని మరిమడ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పోషణ్ అభియాన్‌లో భాగంగా అంగన్‌వాడీ టీచర్లు లక్కం లక్ష్మి, లక్ష్మి విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకహారం గల తోటల పెంపకంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

22
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...