ఎమ్మెల్సీగా చంద్రశేఖర్‌గౌడ్ గెలుపు ఖాయం


Tue,March 19, 2019 03:16 AM

-టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి హరీశ్
-శ్రేణులతో కలిసి జిల్లాలో విసృత ప్రచారం
సిరిసిల్లటౌన్: కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ బ లపరిచిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ గెలుపు ఖాయమని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ ఘంటాపథంగా తెలిపారు. జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్ర త్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో చంద్రశేఖర్‌గౌడ్ క్రియాశీలకంగా వ్యవహరించారని తె లిపారు. సాధారణ కు టుంబం నుంచి వచ్చిన ఆయన గ్రూప్-1 అధికారిగా విస్తృతమైన సేవలు అందించారని వివరించారు. ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటాలు ఎన్నో చేశారని కొనియాడారు. పట్టభద్రుల హక్కుల సాధన కోసం తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి ఎమ్మెల్సీగా బరిలో నిలిచారన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంపూర్ణ మద్దతు ఆయన కుందని తెలిపారు. చంద్రశేఖర్‌గౌడ్ పట్టభద్రుల సమస్యలను పరిష్కరించే శక్తిగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రులు తమ ఓటుహక్కును సద్వినియో గం చేసుకుని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో షేక్ సిఖిందర్, అరుణ్, బాబా, చోటు, అఖిల్, వంశీ, ప్రశాంత్, చిక్కు, ప్రణయ్ పాల్గొన్నారు.
భారీ మెజార్టీని అందించాలి..
జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల తెలంగాణ టీచర్స్, లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్ మాట్లాడారు. చంద్రశేఖర్‌గౌడ్‌ను భారీ మెజార్టీని అందించాలని పిలుపునిచ్చారు. శాసన మం డలిలో పట్టభద్రుల సమస్యలను వినిపించేందుకు చం ద్రశేఖర్‌గౌడ్‌ను అఖండమైన మెజార్టీతో గెలిపించాలని, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కానుకగా అం దిస్తామని వివరించారు. సమావేశంలో జగదీశ్వర్, చిక్కుడ మహేష్, రాజు, మల్లేషం, వెంకటేష్, ప్రవీణ్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...