తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక


Tue,March 19, 2019 03:16 AM

-ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి
-ప్రత్యేక హెల్ప్‌సెంటర్ ఏర్పాటు: జేసీ యాస్మిన్‌బాషా
-అధికారులతో సమావేశం
కలెక్టరేట్: వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోవాలని సంబంధిత అధికారులను జేసీ యాస్మిన్‌బా షా ఆదేశించారు. వేసవి కార్యాచరణ ఆంశంపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో కలెక్టరేట్ సమావేశ హా లులో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి జేసీ దిశానిర్దేశం చేశారు. తాగునీటి కొరత ఉన్న అన్ని ప్రాం తాలను తొలుత గుర్తించాలని, అక్కడ యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జనం సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులం తా పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని తెలిపారు. ఉపాధి హామీ పనుల ప్రదేశాలల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని, టెంట్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని వివరించారు. నీటి పథకాలను 15 రోజులకు ఒకసారి శుభ్రపరచాలని, సదరు ఫొటోలను సమర్పించాలని సూచించారు. వడదెబ్బ లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వీలుగా కరపత్రాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముద్రించి పంపిణీ చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పీహెచ్‌సీల్లోని సిబ్బందికి, ఆశ వర్కర్లు, పారామెడికల్ సిబ్బందికి ఎం డల తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వెంటనే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతీ గ్రామంలో వేసవి కార్యాచరణపై సర్పంచ్‌ల అధ్యక్షతన సమావేశం నిర్వహించాలని డీపీవో శేఖర్‌ను ఆదేశించారు. మూగజీవాలకు తాగునీటి, పశుగ్రాసం కొర త లేకుండా జాగ్రత్తపడాలన్నారు. నీటి తొట్టెలకు మరమ్మతులు చేపట్టాలన్నారు. ఇప్పటి వరకు 8 ప్రభుత్వ శాఖలే వేసవి కార్యాచరణ ప్రణాళికను అందించాయని, మిగతా శాఖలు వెంటనే అందివ్వాలని ఆదేశించారు.
కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్ సెంటర్..
అత్యవసర సహాయం అందించేందుకు కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్ నంబర్ 6309141122 ఏర్పాటు చేశామన్నారు. కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేసి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ప్రచార గోడ ప్రతులు, కరపత్రాలను జేసీ ఆవిష్కరించారు. సమావేశంలో డీఎఫ్‌వో శ్రీనివాస్, సీపీవో రాజారాం, డీడీ మోహన్‌రావు, ఈఈ జానకి, డీపీఆర్వో దశరథం, డీఐఈవో రామచంద్రం పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...