అమర జవాన్లకు ఘన నివాళులు


Mon,February 18, 2019 02:55 AM

చందుర్తి : పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన భారత జవాన్లకు ఆదివారం మండల వ్యాప్తంగా ఘన నివాళులర్పించారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన టీఆర్‌ఎస్ నాయకులు చందుర్తి తెలంగాణ చౌక్‌లో సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. విశ్వహిందూ పరిషత్, భజ్‌రంగ్‌దళ్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్, లింగంపేట, తదితర గ్రామాల్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మల దహనం చేశారు. అమరవీరుల చిత్రపటానికి నివాళులర్పించారు. ఎంపీపీ తిప్పని శ్రీనివాస్, మరాఠి మల్లిక్, ఈర్లపల్లి రాజు, ఐల్నేని కమలాకర్ రావు, యండి ఇస్మాయిల్, భూక్య షరిలాల్, లింగంపల్లి సత్తయ్య, గట్టు లక్ష్మినారాయణ, మాదాసు వేణు, మార్తా గంగాధర్, మొకినెపల్లి దేవరాజు, కుసుంబ జనార్థన్, ఎనుగుల శ్రీనివాస్, పోతరాజు నాగేష్, నల్మాష్ భూంరెడ్డి, బొళ్లిపల్లి నాగయ్య, కొండ లక్ష్మణ్, బత్తుల కమలాకర్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, తిరుజానీ, ఉగిలె శ్రీనివాస్, కొమ్ము రమేశ్, మెరుపుల గంగాధర్, ఐతం శ్రీనివాస్, పోతుగంటి రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.
రుద్రంగి : కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాదుల బాంబు దాడిలో వీరమరణం పొందిన జవానుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆదివారం హైదారాబాద్‌లోని వేములవాడ నియోజరవర్గ విద్యార్థులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ దేశం కోసం ఉగ్రవాదుల బాంబు దాడిలో వీరమర ణం పొందిన జవానుల త్యాగాలు వృథాకావన్నారు. అనంతరం జ వానుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పా టించారు. గంధం మనోజ్, శ్రీకాంత్, చింటూ, భాస్కర్, శేఖర్, భువనేష్, మహిపాల్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...