తెలంగాణ దేశానికే ఆదర్శం


Mon,February 18, 2019 02:54 AM

-కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
-స్తంభంపల్లి, కోరెం గ్రామాల్లో పర్యటన
- పలు అభివృద్ధి పనులు ప్రారంభం
బోయినపల్లి: తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కొనియాడారు. మండలంలోని స్తంభంపల్లి, కోరెం గ్రామాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ఆయన ఆదివారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో నిర్మించిన 133/కేవీ సబ్‌స్టేషన్లను ప్రారంభించారు. కోరెంలో సీసీ రహదారి, ప్రతిమ వైద్యశాలకు ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోరెంలో ఏర్పాటు చేసిన సభలో ఎంపీ వినోద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులు అనుభవిస్తున్న కష్టాలను తీర్చాలని తెలంగాణ ఉద్యమ కాలంలోనే నిర్ణయించుకున్నామని వివరించారు. స్వరాష్ట్ర సాధనలో క్షేత్రస్థాయిలో తిరుగిన ప్రతీ గ్రామంలోనూ అక్కడి పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కేసీఆర్ చర్చించేవారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన కేసీఆర్ సమస్యలను అధిగమిస్తూ ఇవాళ దేశంలో ఎక్కడా కరెంటు ఉన్న కొనుగోలు చేసి గడిచిన ఐదేళ్లలో నిరంతరం విద్యుత్ అందిస్తున్నారని, ఆ ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు. రాబోయే రెండేళ్లలో కరెంటును అమ్మేస్థాయికి రాష్ట్రం ఎదిగిపోతుందన్నారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టులను వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని వివరించారు. పంట పెట్టుబడికి రూ.10వేల ఆర్థిక చేయూత ఇవ్వడమేగాక, రైతుబీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ దేశానికే మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో సెస్ చైర్మన్ లకా్ష్మరెడ్డి, రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్‌రావు, ఎంపీపీ సత్తినేని మాధవ్, జ డ్పీటీసీ లచ్చిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చె న్నాడి సుధాకర్‌రావు, డీసీఎంఎస్ చై ర్మన్ సురేందర్‌రెడ్డి, సెస్ డైరెక్టర్ ఏను గు లక్ష్మి, వైస్ ఎంపీపీ వేణుగోపాల్, సర్పంచ్‌లు చిన్నాడి రాజ్యలక్ష్మి, అక్కనపల్లి జ్యోతి, కొప్పుల లక్ష్మి, ప్రేమ్‌సాగర్‌రావు, ఎంపీటీసీ వంగపల్లి రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ భాగ్యలత, నాయకులు వెంకట్ రామారావు, కనకయ్యతదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...