విద్యా ప్రమాణాల పెంపునకు కృషి


Sun,February 17, 2019 03:31 AM

-ఎంఈవో వి.రాంచందర్‌రావు
-ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన విద్యావేత్తలు
సిరిసిల్ల ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్నామని ఎంఈవో రాంచందర్‌రావు అన్నారు. హైదరాబాద్‌కు చెందిన మాల్పిలాన్ విద్యాసంస్థల నిర్వాహకులు పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాల్పిలాన్ విద్యాసంస్థల నిర్వాహకుడు రతీకోత్వల్ మట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి ఆంగ్ల విద్యాబోధన చేపట్టడం హర్షణీయమన్నారు. విద్యాబోధనకు తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు నాలుగు వారాలపాటు హైదరావాద్‌లోని తమ విద్యాసంస్థలు, వివిధ కార్పొరేట్ స్థాయిలో ప్రముఖులతో శిక్షణ ఇస్తామని తెలిపారు. విద్యార్థులు చదవడమే కాకుండా, చుట్టూ ఉన్న పరిస్థితులపై అవగహన కలిగిఉండాలన్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించే విధానాన్ని పరిశీలించారు. రిటైడ్ ప్రొఫెసర్ గీతానాయర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యా ప్రమాణాలు పెంపొందిండానికి ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి సూచన మేరకు సిరిసిల్లను సందర్శించనట్లు తెలిపారు. కార్యక్రమంలో బాలికల పాఠశాల హెచ్‌ఎం భాగ్యరేఖ, నెహ్రూనగర్ పాఠశాల హెచ్‌ఎం గణేష్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు శ్రీనివాస్‌రావు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...