వస్త్ర పరిశ్రమలో 15రోజులకోసారి కూలి చెల్లింపు


Thu,February 14, 2019 03:18 AM

-5, 20 తేదీల్లో పంపిణీ : చేనేత జౌళీ శాఖ ఏడీ అశోక్‌రావు
కలెక్టరేట్: సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమలో కార్మికులకు 15రోజులకోమారు కూలి చెల్లించే విధా నాన్ని అమలు చేస్తున్నామని చేనేత జౌళీ శాఖ సహాయ సంచాలకుడు అశోక్‌రావు వెల్లడించా రు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత జనవరి 22న కలెక్టర్ వెంకట్రామరెడ్డి సమక్షంలో వస్త్ర పరిశ్రమ యజమానులు, ఆసాములు, మ్యాక్స్ సంఘాల అధ్యక్షులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చిం చి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. అందులో ప్రధానంగా కార్మికులకు ప్రస్తుతం ప్రతీ ఆదివారం కూలీ చెల్లిస్తున్నారని, తద్వారా అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం బదులుగా ప్రతినెలా 5వ, 20వ తేదీల్లో కూలి చెల్లించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి నుంచే అమలు చేస్తున్నామని, దీంతో వస్త్ర పరిశ్రమలో పనిచేసే వారందరికీ ఆదివారం సెలవు లభిస్తుంద ని వివరించారు. అదీగాక రెండు, మూడురోజుల మగ్గాలు బంద్ ఉండడతో ఉత్పత్తి కార్మికుల కూలి తగ్గుతుండేదని, ఈ నిర్ణయంతో ఉత్పత్తి పెరిగి కూలి పెరుగుతుందని తెలిపారు. ఈ విధానం అమలు చేయని యజమానులకు ప్రభుత్వ ఉత్పత్తి ఆర్డర్లను రద్దు చేస్తామని ఏడీ అశోక్‌రావు స్పష్టం చేశారు. దీని అమలుకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...