త్వరలోనే ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు


Wed,February 13, 2019 02:32 AM

-17న ఆర్థిక సంఘం సభ్యుల రాక: జేసీ యాస్మిన్‌బాషా
వేములవాడ రూరల్: త్వరలోనే ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా సురక్షిత తాగునీ రు అందిస్తామని జాయింట్ కలెక్టర్ యాస్మిన్‌బాషా వెల్లడించారు. వేములవాడ మం డలం అగ్రహారం ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను డీఆర్వో ఖీమ్యానాయక్, ఆర్డీవో శ్రీనివాస్‌రావుతో కలిసి ఆమె మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ యాస్మిన్ బాషా మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులను దాదాపు 90 శాతం పూర్తి చేశామన్నారు. ఇంకా కొద్దిపనులు ఉన్నాయనీ వాటిని పూర్తి చేసి సురక్షితమైన నీరు ప్రతీ ఇంటికీ చేరేలా చర్యలు చేపట్టామన్నారు. దాదాపు 40 వేలకోట్లతో భారీ పథకం ప్రవేశపెట్టిన గొప్ప రాష్ట్రంగా తెలంగాణేనని కొనియాడారు. ఆ పథకాన్ని చేసేందుకు కేంద్ర ఆర్థిక సంఘం సభ్యులు రానున్నారని వెల్లడించారు. ఈ నెల 17న కేంద్ర 15వ ఆర్థిక సంఘం సభ్యులు అగ్రహారంలో మిషన్ భగీరథ పథకంలోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను పరిశీలిస్తారన్నారు. వారు నేరుగా హెలిక్యాప్టర్ ద్వారా అగ్రహారంలోని ట్రీ ట్‌ప్లాంట్‌కు చేరుకోని పనులను పరిశీలించే అవకాశముందన్నారు. ఇప్పటికే హెలీప్యాడ్ కోసం స్థలాన్ని పరిశీలించామన్నారు. అనంతరం మిషన్‌భగీరథ అధికారులు వా టర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ గురించి జేసీకి వివరించారు. ఆమె వెంట మిషన్ భగీరథ ప ర్యవేక్ష ఇంజినీర్ ప్రకాశ్‌రావు, డీఈ సురేశ్ పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...