న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయాలి


Wed,February 13, 2019 02:32 AM

-సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు
-కోర్టు విధుల బహిష్కరణ
-జేసీకి వినతిపత్రం
సిరిసిల్ల లీగల్ : న్యాయవాదుల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టాలని సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాసరావు కోరారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు మంగళవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. జేసీ యాస్మిన్ బాషాను కలిసి వినతిపత్రం అందజేశారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో న్యాయవాదుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌చేశారు. ప్రతి న్యాయవాదికీ రూ.20 లక్షలు బీ మా సౌకర్యం కల్పించాలని, విరమణ చేసిన న్యాయవాదులకు పింఛన్ ఇవ్వాలన్నారు. నూతనంగా ప్రాక్టీస్‌కు వ చ్చిన జూనియర్ న్యాయవాదులకు ఐదేండ్ల పాటు ైస్టె ఫం డ్ ఇవ్వాలని కోరారు. బార్ అసోసియేషన్‌లో లైబ్రరీ, ఈ లైబ్రరీ, ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించాలని, మహి ళా న్యాయవాదులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాల యం ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఉమాశంకర్, ప్రకాశం, కోడం సురేశ్, రమాకాం త్, జనార్దన్, సత్యనారాయణ, పర్శరాములు, వెంకట య్య, మనోహర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...