లక్ష్యసాధనకు పాటుపడాలి


Wed,February 13, 2019 02:31 AM

-ఏకాగ్రతతో చదివితేనే ఉత్తమ ఫలితాలు
-జిల్లా విద్యాధికారి రాధాకిషన్
-పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన
గంభీరావుపేట: పదో తరగతి విద్యార్థులు ఏకాగ్రతతో చదివితేనే రానున్న వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. మండల కేంద్రంలోని దత్తసాయి గార్డెన్‌లో మంగళవారం ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం నిర్వహించిన అవగాహన సదస్సుకు డీఈవో ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. పదో తరగతి వార్షిక పరీక్షలను ఉద్దేశించి భారతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని 384మంది విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించడం అభినందనీయమని కొనియాడారు. జీవితంలో పదో తరగతి కీలక మలుపుగా భావించి, 45రోజుల పాటు ఏకాగ్రతతో చదివితే విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకుంటారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సకల వసతులు కల్పిస్తున్నదని పేర్కొన్నారు. కష్టపడి చదవుతూ, ఉన్నత ఫలితాలు సాధించి ప్రభుత్వ పాఠశాలలకు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. భారతీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు జ్ఞాపక శక్తి, భయం, మేదస్సు తదితర అంశాలపై అవగాహన కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హైదరాబాద్‌కు చెందిన మనో వికాస నిపుణులు దిలీప్, స్వామి విద్యార్థులు పరీక్షలకు మందు, పరీక్ష సమయంలో అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ కటకం శ్రీధర్, జడ్పీటీసీ మల్లుగారి పద్మ, తహసీల్దార్ సుమ, ఎంఈవో మంకు రాజయ్య, భారతీ ఫౌండేషన్ డైరెక్టర్ బరిగెల శ్రీనివాస్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

27
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...