పోస్టుమ్యాన్ భగీరథ్ మృతి


Wed,February 13, 2019 02:31 AM

-43 ఏండ్లుగా వేములవాడలోనే విధులు
-గుండెపోటుతో కన్నుమూత
వేములవాడ, నమస్తేతెలంగాణ: గ్రామీణ తపాలశాఖ ఉ ద్యోగిగా సుదీర్ఘంగా విధులు నిర్వహిస్తున్న బాల్కీ భగరీథ శర్మ (63) మం గళవారం మృతి చెందారు. ఉదయం సిరిసిల్లలోని ఆయన నివా సంలో గుండెపోటు రాగా కరీంనగర్‌కు తరలించారు. ఆయన అక్క డే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1976లో గ్రామీ ణ తపాలశాఖ ఉద్యోగిగా విధుల్లో చేరిన భగీరథ శర్మ 43 ఏళ్లుగా వేములవా డ పోస్టల్ కార్యాలయంలో సేవలు అందించారు. వేములవాడ పట్టణ ప్రజలకు పోస్టుమ్యాన్ భగీరథ్‌గా సుపరిచితుడైన ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు భార్య చంద్రకళ, కొడుకు, కూతురు ఉన్నారు. వేములవాడ పోస్టుమాస్టర్ మహేశ్, సహచర సిబ్బంది పుల్లూరి రాజేందర్, అనీల్‌కుమార్, నాగరాజు, విద్యాసాగర్‌రెడ్డి, శ్రీనివాస్‌తో పాటు తదితరులు సిరిసిల్లకు వెళ్లి ఘన నివాళులు అర్పించారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...