పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం


Tue,February 12, 2019 03:22 AM

-మున్సిపల్ కౌన్సిలర్ కల్లూరి రేణుక
-బాధితురాలికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
సిరిసిల్ల టౌన్: పేదల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని మున్సిపల్ కౌన్సిలర్ కల్లూరి రేణుక అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటకు చెందిన జె.రేణుకకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 60వేల చెక్కును సోమవారం అందజేసి, మాట్లాడారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సీఎం కేసీఆర్ పేదల వైద్యానికి సాయం చేస్తున్నారని కొనియాడారు. స్వరాష్ట్రం లో అన్నివర్గాల సంక్షేమానికి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు కల్లూరి రాజు, మధు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట: మండలంలోని అనంతగిరి గ్రామానికి చెందిన రెండు కుటుంబాలకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను సర్పంచ్ పల్లె నర్సిహంరెడ్డి అందజేశారు. కూనవేని రాజేశంకు 22వేలు, కుంచం రాజవ్వకు 44వేల చెక్కులను అందజేశామని సర్పంచ్ తెలిపారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎంపీపీ గుడిసె ఐల య్య, జడ్పీటీసీ సిద్దం వేణు, సెస్ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గొడుగు తిరుపతికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కుంచం సత్యం,రెడ్డి ముత్యంరెడ్డి, సురేందర్‌రెడ్డి, దేవేందర్, బాలయ్య, అంజయ్య, కిషన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట: రాజన్నపేట గ్రామానికి చెందిన నమిలికొండ భారతికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కును ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్ అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న భారతికి వైద్యచికిత్స కోసం 21వేలు మంజూరు కాగా, సోమవారం అందజేసినట్లు తెలిపారు. ఇందులో మాజీ సర్పంచ్ ద్యాప ఎల్లయ్య, శివారెడ్డి, నమిలికొండ నర్సింలు, చంద్రారెడ్డి, మైశయ్య, జగన్, సుధాకర్‌రెడ్డి, స్వామి, లక్ష్మణ్, ఉమేశ్, శ్రీనివాస్ ఉన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...