పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలి


Sun,January 20, 2019 02:34 AM

-టీఆర్ నాయకుడు ఏనుగు మనోహర్
వేములవాడ రూరల్ : టీఆర్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని టీఆర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని మర్రిపెల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి కటకం మల్లేశం తరుపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. చింతల్ రేగులపాటి ఇందిర ఇంటింటా ప్రచారం చేస్తూ తనకు మద్దతు పలుకాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మద్దతు తనకే ఉందన్నారు. అనంతరం పెద్ద ఎత్తున్న ర్యాలీ నిర్వహించారు. రుద్రవరంలో తునికి మల్లయ్య ఇంటింటా ప్రచారం చేశారు. అనుపురంలో టీఆర్ సీనియర్ నాయకులు ఎర్రం మహేశ్ తన కొడుకు ఎర్రం అదిత్యపటేల్ సర్పంచ్ బరిలో ఉండడంతో ప్రచారం చేశారు. చెక్కపల్లిలో టీఆర్ పార్టీ బలపరిచిన తుంగతుర్తి లక్ష్మణ్ కూడా తన అనుచరులతో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్ నాయకులు భాస్కర్ శ్రీనివాస్, రాంరెడ్డి, బాల్ వెంకటేశ్, శ్రీనివాస్, రాంరెడ్డి, రాజిరెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ రూరల్ : టీఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలని తెలంగాణ రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగంపల్లి దేవయ్య పేర్కొన్నారు. శనివారం మండలంలోని నమిలిగుండుపల్లి, మల్లారం, నూకలమర్రి తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో టీఆర్ పార్టీ బలపరిచిన సర్పంచ్ రజకులతో పాటు అన్ని కులాలు మద్దతు తెలపాలన్నారు. గ్రామాల అభివృద్ధి జరగాలంటే టీఆర్ పార్టీ బలపరిచిన వారిని గెలిపించాలని కోరారు. అనంతరం గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు గుగ్గిల తిరుపతి, లింగంపల్లి మోహన్, లింగంపల్లి రవీందర్, నేరెళ్ల నర్సయ్య, ప్రశాంత్, తదితరులున్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...