జాతరను ఘనంగా నిర్వహిస్తాం


Sun,January 20, 2019 02:34 AM

-భక్తులకు సౌకర్యాలు కల్పిస్తాం
-తహసీల్దార్ ధార ప్రసాద్
-సీతారామస్వామి ఆలయ జాతర ఏర్పాట్లపై సమావేశం
కోనరావుపేట: వేములవాడ అనుబంధ దేవాలమైన మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి ఆలయం వద్ద వచ్చేనెల 4న మాఘ అమవాస్య జాతరను అత్యంతవైభవంగా నిర్వహిస్తామని తహసీల్దార్ ధార ప్రసాద్ అన్నారు. శనివారం ఆలయ ఆవరణలో జాతర ఏర్పాట్లపై ఆలయ అధికారులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ముందుగా గుట్టపైకి వెళ్లేందుకు ఘాటురోడ్డును, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ వివిధ జిల్లాల నుంచి లక్ష మంది జాతరకు తరలిరానున్నట్లు అంచనావేశారు.భక్తులకు ఎలాంటి ఆసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్యం, ట్రాఫిక్ పాటు పలు సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించామన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని చెప్పారు. భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థాన సిబ్బందితో పాటు వలంటీర్లను నియమిస్తామన్నారు. జాతరలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలిస్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి పార్కింగ్ స్థలాలను, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతర ఉత్సవాలకు వచ్చే భక్తులకు వేములవాడ నుంచి ఆర్టీసీ బస్సు సౌక ర్యాన్ని కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

శాంతి భద్రతలు కట్టుదిట్టం
జాతరలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ నరేశ్ తెలిపారు. ట్రాఫిక్ సమస్యలను తలెత్తకుండా భక్తులు సహకరించాలన్నారు. వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు, దోపిడీలు, చోరీలు జరగకుండా నియంత్రిస్తామన్నారు. బెల్టు షాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో వేములవాడ ఆలయ ఏఈవో ఉమరాణి, ఏఈ రామకిషన్ మామిడిపల్లి ఆలయ సూపరింటెండెంట్ గోలి శ్రీనివాస్, ఆలయ ఇన్ నేగూరి నరేందర్, ఎంపీటీసీ లక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ కోల కమలాకర్, అలయ అర్చకులు రం గనాయకుల శ్రీనివాస్, లక్ష్మణ్, హెల్త్ సూపర్ శ్రీదేవి, నాయకులు మిర్యాల ప్రభాకర్ లక్ష్మారెడ్డి, రవీందర్ గౌడ్, బాలయ్యగౌడ్, తక్కల్ల ఎల్లారెడ్డి, రాములు గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, కులేరు శ్రీనివాస్, నాంద్యడపు సాగర్, నర్సయ్య, సత్తిరెడ్డి, ఆయాశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...