భళా..‘ఇన్


Sun,January 20, 2019 02:34 AM

-అబ్బురపరుస్తున్న విద్యార్థుల సృతజనాత్మక
-ఆకట్టుకుంటున్న ప్రాజెక్టులు
-మండెపల్లి మోడల్ ఉత్సాహంగా కొనసాగుతున్న సైన్స్ ఎగ్జిబిషన్
- పరిశీలించిన సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల డీఈవోలు
సిరిసిల్లరూరల్: తంగళ్లపల్లి మండలం మోడల్ సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు కలిపి నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ఇన్ -మానక్ వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నది. విద్యార్థుల ప్రదర్శిస్తున్న ప్రాజెక్టులు అబ్బుర పరుస్తున్నాయి. సుమారు 232అంశాలపై బాలమేధావులు రూపొందించిన ఎగ్జిబిట్లను చూసేందుకు తరలివస్తున్న సందర్శకులతో స్కూల్ సందడిగా మారింది. జాతీయ స్థాయిలో భారతదేశ శాస్త్ర, సాంకేతిక విభాగం డీఎస్ ఆధ్వర్యంలో 2009-10లో నుంచి పాఠశాల స్థాయిలోప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, ప్రోత్సహించడానికి ఇన్ ప్రోగ్రాంను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. శాస్త్ర, విజ్ఞాన రంగాల్లో పరిశోధనల్లో ఔత్సాహికులను గుర్తించి ప్రోత్సహించడానికి ఇన్ అవార్డ్ మానక్ ద్వారా 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఎంపికైన ప్రాజెక్టు, మోడల్ తయారు చేసేందుకు విద్యార్థికి 10వేల నగదును ప్రోత్సాహకంగా అందిస్తున్నారు. అందులో భాగంగా సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల విద్యార్థులకు కలిపి మండెపల్లి మోడల్ స్కూల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.
ఆకట్టుకున్న కేజీబీవీ విద్యార్థుల ప్రదర్శనలు
జిల్లా స్థాయి ఇన్ సైన్స్ ఎగ్జిబిషన్ కస్తూర్బా గాం ధీ బాలిక విద్యాలయం విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఘన వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేసి వినియోగంలోకి తేవడం, పర్యావరణ పరిరక్షణ పచ్చని ఇంటి ప్రాధాన్యత, ఇంటికి సరిపంతా లెడ్ లైట్ కాంతులను ఇంట్లోనే తయారుచేసుకునే విధానం, నివాస గదుల్లో దుర్వాసన రాకుండా, క్రిమి కీటకాలు సంచరించకుండా నివారించడం, ఇంధనం పొదుపు చేసే అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులు అందరినీ ఆకర్షించాయి.
ప్రముఖుల ప్రశంసలు..
ఇన్ సైన్స్ ఎగ్జిబిషన్ రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల డీఈవోలు రాధాకిషన్, వేంకటేశ్వర్లు, సైన్స్ అధికారులు అంజనేయులు, రవీందర్ కో కన్వీనర్లు రాం చందర్ పరబ్రహ్మ మూర్తిలతో కలిసి సందర్శించారు. అదేవిధంగా జడ్జీలు శ్రీదేవి, రాజశేఖర్, మధుసూదన్, ఉపేందర్ విచ్చేశారు. ప్రాజెక్టులను రూపొందించిన విద్యార్థులతో మాట్లాడి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. వారి ప్రతిభను ప్రశంసించారు. ఈ సందర్భంగా సీసీఆర్టీ కన్నం రమేశ్, లాల శ్రీనివాస్, నవీన్ ఆధ్వర్యం లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించా యి. కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శివకుమార్ సెక్టోరియల్ అధికారులు శ్రీనివాస్, రాజేంద్రశర్మ, శ్రీనివాస్, నిర్వహణ కమిటీ కన్వీనర్లు మద్దికుంట లక్ష్మణ్, పాకాల శంకర్ ఆడెపు సుదర్శన్, శ్రీనివాస్, అశోక్, తిరుపతిరెడ్డి, ప్రభాకర్, సంపత్ తదితరులున్నా రు. ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి విజేతలను ఆదివారం ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...