తుది విడత 2,781 నామినేషన్లు


Sat,January 19, 2019 02:33 AM

-ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ
- పంచాయతీలు 90
-వార్డులు 764
-సర్పంచ్ స్థానాలకు 679
-వార్డు స్థానాలకు 2,102
-ఒకటవ రోజు 502
-రెండవ రోజు 778
-మూడవరోజు 2,781
-నేడు పరిశీలన
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ :పల్లెపోరులో తుడి విడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. బుధవారం అట్టహాసంగా ప్రారంభమై శుక్రవారం వరకు వెల్లువల సాగింది. మూడు మండలాల పరిధిలోని 90 గ్రామ పంచాయతీలు, 764 వార్డు స్థానాలకు నామినేషన్లు అధికారులు స్వీకరించారు. మూడు రోజులలో మొత్తం 2,781దరఖాస్తులు దాఖలు కాగా, ఇందులో సర్పంచు స్థానాలకు 679
వార్డు స్థానాలకు 2,102 వచ్చినట్లు యంత్రాంగం వెల్లడించింది. 11 గ్రామ పంచాయతీలు, 25 వార్డు స్థానాలకు సింగిల్ డిజిట్ నామినేసన్లు దాఖలు కావడంతో అవి ఏకగ్రీవం కింద అయినట్లు భావిస్తున్నారు. నేడు నామ పత్రాల పరిశీలన, ఎల్లుండి ఉపసంహరణల అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.
పంచాయతీ ఎన్నికల తుది విడత నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. కోనరావుపేట, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మూడు మండలాల్లో 90 గ్రామ పంచాయతీలు, 764 వార్డులకుగాను 27 క్లస్టర్ ఏర్పాటు చేసి నామినేషన్లను స్వీకరించారు. మొత్తం 2,781నామినేషన్లు దాఖలు కాగా ఇందులో సర్పంచ్ స్థానానికి 679, వార్డు స్థానాలకు 2,102 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి రోజు 502 నామినేషన్లు దాఖలు కాగా, సర్పంచ్ స్థానాలకు 135, వార్డు స్థానాలకు 367, రెండవ రోజు 778 నామినేషన్లు వచ్చాయి. ఇందులో సర్పంచు స్థానాలకు 193, వార్డు స్థానాలకు 585లు, 3వ రోజు మొత్తం 1,501నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సర్పంచు స్థానాలకు 351, వార్డు స్థానాలకు 1,150 దాఖలయ్యాయి. 11 గ్రామ పంచాయతీలు, 25 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో కోనరావుపేట మండలంలో 5 పంచాయతీలు, 25 వార్డు స్థానాలుండగా, ఇల్లంతకుంట మండలంలో 4 గ్రామ పంచాయతీలున్నాయి.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...