ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ


Sat,January 19, 2019 02:31 AM

-పకడ్బందీగా బందోబస్తు
-నేరాల నియంత్రణకు తనిఖీ
-ఎస్పీ రాహుల్
-పోలీసు అధికారులతో సమీక్ష
సిరిసిల్ల క్రైం: ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరిగేలా పకడ్బందీగా బం దోబస్తు నిర్వహిస్తామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ఈ మే రకు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన పోలీ సు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేరాలు, సంఘటనలపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జరగనున్న పంచాయతీ ఎన్నికలు, రాబోయే పార్లమెంట్ ఇతర ఎన్నికలతోపాటు పోలింగ్ కేంద్రాల నిర్వహణ ప్రణాళిక బద్ధంగా భద్రత చర్యలు తీసుకుంటున్నామన్నా రు. గత ఎన్నికల్లో నమోదైన కేసులు, గొడవలు అల్లర్లు సృష్టించిన వ్యక్తులపై నిఘా ఉంచాలన్నా రు. సమస్యలుంటే ముందుగానే గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటుహక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. నేనుసైతంలో అన్నివర్గాల ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చే యాలనీ, నేరాల నియంత్రణకు ఏ ర్పాటు చేసే సీసీ కెమెరాలకు జియో ట్యాగింగ్ కూడా చేయాలన్నారు. జిల్లా కు కేటాయించిన పెట్రోలింగ్ వాహనాల నిర్వహణను ,సంబంధిత అధికారిదే బాధ్యత తీసుకోవాలన్నారు. విద్యార్థుల్లో ధైర్యసాహసాలు, సామాజిక సృహ, మానసిక ధైర్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కృషి చేస్తున్నామనీ, ఇందుకు రాష్ట్ర పోలిస్ శాఖ, జిల్లా విద్యాశాఖ సమన్వయంతో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ కోర్స్ చేసినట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే జిల్లాలోని పాఠశాలలో ఇన్ అధికారులను నియమించామన్నారు. ఈ చలాన్ వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చామని, ట్రాఫిక్ నియయ ఉల్లంఘనపై జరిమాన విధించి, ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని, శాంతి భద్రతలకి విఘాతం కలిగించు వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రజాదివస్ ప్రతి సోమవారం ఫిర్యాదు దారుల నుంచి వస్తున్న పిటిషన్లను సీసీసీ ద్వారా సంబంధిత స్టేషన్లకు పంపిస్తున్నామనీ, ఫిర్యాదులపై త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిసోమవారం కోర్టు కానిస్టేబుళ్లలతో సంబంధిత అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించి, వారి సందేహాలను నివృత్తి చేస్తూ, పెండింగ్ కేసుల పరిష్కరించుకోవాలన్నారు. నిత్యం వాహన తనిఖీలు చేపట్టాలన్నారు. గతనెలలో జరిగిన ఆస్తి సంబంధిత కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేరాల ని యంత్రణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. సిరిసిల్ల డీఎస్పీ వెంకటరమణ, ఎస్ బీ డీఎస్పీ నరహరి, వేములవాడ డీఎస్పీ వెంకటరమణ, సీఐలు శ్రీనివాస చౌదరి, మోగిలి, అనిల్ రవీందర్, వెంకటస్వామి, విజయ్ బన్సిలాల్, ఆర్ సుబ్రమణ్యం నా యుడు, రజనీకాంత్, నవీన్, ఎస్ సిబ్బంది ఉన్నారు.

ముస్తాబాద్: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావారణంలో నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు చే స్తున్నట్లు ఎస్పీ రాహుల్ అన్నారు. మండల కేంద్రంలో మోడల్ పోలీసు భవన నిర్మాణ పనులను డీఎస్పీ వెంకటరమణ, రూరల్ సీఐ అనిల్ ఎస్ రాజశేఖర్ కలిసి భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ ఎన్నికల అ నంతరం మోడల్ ఠా ణాను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం శాంతి భద్రల పరిరక్షణ కోసం నేరాలసంఖ్య తగ్గించేందుకు స్నేహపూర్వక పోలీసు విధానాన్ని కొనసాగిస్తూ ప్రజలకు మ రింత దగ్గరవుతుందన్నారు.జిల్లాలో మొదటి, రెం డవ, మూడవ విడతల్లో జరుగునున్న ఎన్నికల్లో 600 మంది పోలీసు సిబ్బంది, అవసరమైన ప్రాంతాల్లో అదనపు బలగాలు సిద్ధంగా ఉంటారన్నారు. 90 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...