రైతులకు ప్రభుత్వం చేయూత


Sat,January 19, 2019 02:31 AM

-కందులకు మద్దతు ధర చెల్లింపు
- దళారులను ఆశ్రయించొద్దు: జేసీ
-సిరిసిల్లలో కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిరిసిల్లటౌన్: రైతలకు ప్రభుత్వం ఎంతగానో చేయూతనందిస్తున్నదని జేసీ యాస్మిన్ కొనియాడారు. మార్క్ ఆధ్వర్యంలో జిల్లా కేం ద్రంలోని మార్కెట్ ఏర్పాటుచేసిన కందుల కొనుగోలు కేం ద్రాన్ని జేసీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యాస్మిన్ షా మాట్లాడుతూ కందులకు ప్రభు త్వం రూ.5,675ల మద్దతు ధరను చెల్లిస్తున్నదని వివరించారు. తేమశాతం 12కు మించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. నిర్దేశిత నాణ్యతా ప్ర మాణాలను పాటించాలని తెలిపారు. వ్యర్థ పదార్థాలు 3శాతం, ఇతర పంటగింజలు 1శాతం, దెబ్బతిన్న గింజలు, రంగుమారినవి 3శాతం, విరిగిన, పొట్టుపోయిన గింజలు 3శాతం, పుచ్చిపోయినవి 3శాతం, పరిపక్వం కాని, నాసిరకం గింజలు 3శాతం మించకుండా చూసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ వ్యవసాయ అధికారి, విస్తరణ అధికారి కంది పంట ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా పాస్ జిరాక్స్ తప్పక వెంట తీసుకురావాలని సూ చించారు. ఈ ఏడాది సుమారు 11వేల క్వింటాళ్లు కొనుగోళ్లు జ రుగుతాయని అంచనా వేస్తున్నామన్నారు. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను పూర్తిచేశామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల, వేములవాడ, రుద్రంగా మార్కెట్ ఆవరణలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతులు ఆయా కేంద్రాల్లోనే కందులను విక్రయించాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం అందిస్తున్న మద్ద తు ధరను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం మార్కెటింగ్ ఆధ్వర్యంలో కంది పంటకు ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరతో ఏర్పాటుచేసిన కరపత్రాలను జేసీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి షాబోద్దీన్, తహసీల్దార్ అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...