గణతంత్ర దినోత్సవాన్నివైభవంగా నిర్వహించాలి


Fri,January 18, 2019 01:19 AM

- అధికారుల సమీక్షలో జాయింట్ కలెక్టర్ యాస్మిన్‌బాషా
కలెక్టరేట్: జనవరి 26 గణతంత్ర దినోత్సవా న్ని వైభవంగా నిర్వహించాలని అధికారులకు జే సీ యాస్మిన్‌బాషా సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా శకటాలను రూపొందించాలన్నారు. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జేసీ గు రువారం సమీక్షించారు. వేడుకలు చూసేందుకు వచ్చే వారికి తాగునీరు, ఇతర వస తులను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉండేలా చూడాలని, శానిటేషన్ పనులను వెంటవెంటనే చేయాలని సూచించారు. స్వాతంత్య్ర సమరయోధులకు ప్రత్యేక ఏర్పాట్లు చే యాలన్నారు. శాఖలవారీగా చేపట్టిన ప్రగతి నివేదికలను సమాచా ర పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో 19వ తేదీలోగా అందజేయాలని ఆదేశించారు. అగ్ని మా పకయంత్రాలను, ఉచిత వైద్య శి బిరాన్ని ఏర్పాటు చేయాలని కోరా రు.

శాఖలవారీగా ఉ త్తమ అధికారులు, ఉద్యోగుల వివరాలను 20వ తేదీలోగా అందించాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వేడుకలకు అధికారులందరూ తప్పక హాజరుకావాలన్నారు. పం చాయతీ ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆస్తుల పంపిణీ, కొత్తపథకాల ప్రకటనలాంటివి చేయకూడదన్నా రు. సమావేశంలో డీఆర్వో ఖి మ్యానాయక్, ఆర్డీ వో శ్రీనివాసరావు, డీఎస్పీ వెంకటరమణ, ము న్సిపల్ కమిషనర్ రమణాచారి, డీఆర్డీవో రవీందర్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...