టీఆర్‌ఎస్ బలపరిచినవారినే గెలిపించాలి


Fri,January 18, 2019 01:18 AM

సిరిసిల్ల రూరల్: పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర నేత, వెలమ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల రామారావు పిలుపునిచ్చారు. ఆయన స్వగ్రామమైన తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్‌లో సర్పంచ్ అభ్యర్థిగా వలకొండ వేణుగోపాలరావు నామినేషన్ దాఖలు చేయగా కార్యక్ర మానికి ఆయన హాజరయ్యారు. తొలుత గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వేణుగోపాలరావుకు బొట్టు పెట్టి గ్రా మస్తులు ఆశీర్వదించి నామినేషన్‌ను పంపించగా, డప్పుచప్పుళ్లతో గ్రామంలో భారీ ర్యాలీ తీశారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత చిక్కాల రామారావు, గ్రామస్తులతో కలిసి వెళ్లి వేణుగోపాలరావు తన నామినేషన్‌ను దాఖలు చేశారు. అనంతరం చిక్కాల రామారావు మాట్లాడారు. టీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గ్రామపంచాయతీ పాలవర్గాలను ఏకగ్రీవంగా చేసుకునేందుకు కృషి చేయాలన్నారు.

ప్రభుత్వం అందజేసే రూ.10లక్షల నజరానాతో పాటు ఎమ్మెల్యే కేటీఆర్ తన కోటా నుంచి మరో రూ.15లక్షలను పోత్సాహకంగా అందించనున్నారని వివరించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గ్రామాల్లో అన్నివర్గాల ప్రజలు ఆలోచించి, ఏకగ్రీవం చేయడానికి కృషి చేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో చె ప్పినట్లుగా గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలు, అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. కస్బెకట్కూర్‌లో గ్రా మంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనుల్లో తాము భాగస్వామ్యంగా ఉన్నామని, రాబోయే రోజుల్లో అభివృద్ధి లో ముందుంచుతామన్నారు. కస్బెకట్కూర్ జనరల్ రిజర్వేషన్ చాలా రోజులకు వచ్చిందని, పార్టీ అభ్యర్థి వేణుగోపాలరావుకు అండగా ఉండి, భారీ మెజార్టీతో గెలిపించాల ని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీవర్ధన్, కిషన్, ప్రశాంత్, పూర్ణతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

తంగళ్లపల్లిలో భారీర్యాలీ..
తంగళ్లపల్లి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ మండల అ ధ్యక్షుడు అంకారపు రవీందర్ సతీమణి అంకారపు అనిత గ్రామస్తులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సెస్ చైర్మన్ దొర్నాల లకా్ష్మరెడ్డి పాల్గొని మాట్లాడారు. అంకారపు అనితను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలు పునిచ్చారు. అంతకుముందు నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పడిగెల మానస, పడిగెల రాజు, మాజీ ఎంపీపీ గజభీంకార్ రాజన్న, కందుకూరి రామాగౌ డ్, ఎండీ హమీద్, రమేశ్, అంజనేయులు, భానుమూర్తి, జంగంపల్లి శేఖర్,శ్రీనివాస్, పర్కపల్లి తిరుపతి, సత్తయ్యతోపాటు పలువురు నాయకులు,గ్రామస్తులు ఉన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...