భోగభాగ్యాల పండుగ


Mon,January 14, 2019 03:44 AM

-నేటి నుంచే మూడు రోజుల సంక్రాంతి
-వాకిళ్లకు రంగుల కాంతి

సిరిసిల్ల కల్చరల్: సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశించే శుభ ఘడియలకు సిద్ధమవడమే భోగి. చెడును తగులబెట్టి మంచిని ఆహ్వానించడమే ఈ పండుగ పరమార్థం. సం క్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే పండుగ కనుక దీనిని భోగి పండుగ అంటారు. పచ్చటి పంటలు.. ఊరూరా భోగి మంటలు.. వాకిళ్లకు రంగుల సింగారాలు.. తెలుగు లోగిళ్లు వెలుగు పూలై విరిసే సంక్రాంతి సంబురాలు రానే వచ్చాయి. మూడు రోజులపాటు ఇంటిల్లిపాది ఘనంగా జరుపుకునే వేడుకలు నేడు ఆరంభమయ్యాయి.

సకలజనులు సిద్ధం
పుష్యమాసం సోమవారం భోగి పండుగను జరుపుకునేందుకు సకల జనులు సిద్ధమయ్యారు. సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. తొలిరోజు భోగి. మలిరోజు మంగళవారం సంక్రాంతి. ఆఖరు రోజుబుధవా రం కనుమ పండుగగా జరుపుకుంటాం. సూ ర్యుడి గమనానికి ప్రతిరూపంగా జరుపుకునే పం డుగనే సంక్రాంతిగా భావిస్తాం. మనం నిర్వహించుకునే ప్రతి పండుగలోనూ, చేసే ప్రతి పూజలోనూ ఏదో ఒక పరమార్థం దాగి ఉంటదన్నది సత్యం. దక్షిణాయణం చివరి రోజుల్లో సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు. దీంతో సూర్యరశ్మి తగినంత ఉండక, క్రిమి కీటకాలు నశించవు. ఈ క్రమంలోనే మహిళలు పెండ (పేడ) నీళ్లతో ఇళ్లన్నీ అలికి శుభ్రం చేసి సుద్ద లేదా బియ్యం పిండితో ముగ్గులు వేస్తారు. వీటి ప్రభావంతో క్రిమి కీటకా లు నశిస్తాయి. ముగ్గుల మీద పెండ ముద్దలుంచి, పసుపు కుంకుమలు పెట్టి బంతి, చేమంతి మొదలైన పూలతో అలంకరిస్తారు. వీటినే గొబ్బెమ్మలు అంటారు.

వేకువ జామునే హరిదాసుల హరినామస్మరణ, గంగిరెద్దుల విన్యాసాలు, వైష్ణవాలయాల్లో విష్ణు సహస్ర నామ పారాయణాలు వీనులవిందు చేస్తాయి. భోగి రోజు గోదాదేవి కల్యాణం కమనీయంగా జరిపిస్తారు. మకర సంక్రాంతి రోజున సంక్రాంతి పండుగను, కనుమ రోజు మినుములతో గారెలు చేసి పెద్దలకు నైవేద్యం పెట్టడం, పశువులను పూజించడం చేస్తారు. పది రోజుల ముందు నుంచే ఇళ్లల్లో రుచికరమైన పిండి వంటలు తయారు చేసుకోవడం మొదలు పెడుతారు. అత్తవారింటికి కొత్త అల్లుళ్లు వచ్చి రాచ మర్యాదలు అందుకుంటారు.

సూర్యారాధన..
సూర్యుడు కర్కాటకం నుంచి ధనస్సు వరకు గల ఆరు రాశులను దాటి మకరరాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రమణం. కర్కాటకం నుంచి ధ నస్సు వరకు సూర్యసంచారకాలం దక్షిణాయనం అంటారు. సూర్యుడు మకర సంక్రమణం చెందే సమయం పవిత్రమైంది. అంతకంటే ముందు భోగి జరుపుకుంటారు. పురాతన పరంపర నుంచి కొత్తదనంలోకి పరిణతి చెందడమే సంక్రమణం. దక్షిణాయనంలో చేసిన పాపాలన్నీ గుట్టగా పోసి కాలపెడితే, పుణ్యకాలమైన ఉత్తరాయణం ఉత్తమ జీవితం ఇస్తుందని నమ్మకం. పాత వ్యవస్థలోని చెడును కాల్చి, సజీవ తత్వాన్ని గ్రహించి, గుణాత్మక పరివర్తనం చేయడమే భోగి మంటలు.

సిరుల భోగి ..
దక్షిణాయణం దేవతలు నిద్రించిన కాలం కావడంతో సంక్రాంతికి ఒక రోజు ముందు పీడ నివారణకు ఇంట్లోని పురాతన వస్తువులను భోగి మం టల్లో ఆహుతి చేస్తారు. ఈ రోజు నుంచి కొత్త వస్తువులు ఉపయోగించడం ఆనవాయితీ. భోగి రోజు న తెల్లవారుజామున పిల్లలకు తలస్నానం చేయిం చి రేగుపండ్లు, చెరుకుముక్కలు, అక్షింతలు కలిపి తలలపై పోయడం ద్వారా దృష్టిదోషం తొలగిపోతుందని పెద్దలు చెబుతారు. భోగి రోజే గోదాదేవి రంగనాథస్వామిని వివాహమాడింది. అప్పటి నుంచే ఆమె భోగభాగ్యాలు పొందిందని ప్రతీతి. భోగి రోజు మహిళలు వాకిళ్లను రంగు రంగుల ముగ్గులతో నింపి, ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మల ను పెడుతారు. వాటిపై గరక పోసలు ఉంచి, చు ట్టూ నవధాన్యాలు, పళ్లు పోస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి తమ ఇళ్లలోకి వస్తుందని నమ్మకం.

మకర సంక్రాంతి.. కనుమ..
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజు ను మకర సంక్రాంతి అంటారు. ఈ రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది. ఇది మహా పుణ్యకాలం. ఈ పండుగల తర్వాత రోజు జరుపుకునే పండుగ కనుమ. ఇది రైతుల పండుగ. పశువులను అలంకరించి గోప్రదక్షిణం చేస్తారు. ఆ రకంగా వాటి రుణాన్ని తీర్చుకున్నట్లు భావిస్తారు. గ్రామ దేవతలకు నైవేద్యాలు పెడుతారు. కొత్త ధాన్యాలతో పొంగలి వండి దేవుడికి ప్రసాదంగా నివేదిస్తారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...