గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం


Mon,January 14, 2019 03:42 AM

రుద్రంగి: రుద్రంగి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి తలారి మణికి అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని జడ్పీటీసీ అంబటి గంగాధర్ అన్నా రు. ఆదివారం రుద్రంగి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్ నాయకులు విలేకరులతో సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ అంబటి గంగాధర్ మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అధికార పారీ ్టటీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి తలారి మణికి ఈనెల 21న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రుద్రంగి గ్రామాన్ని ద త్తత తీసుకొని అభివృద్ధి చేసే దిశగా పక్కా ప్రణాళికలతో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ముందుకు సాగుతున్నారని తెలిపారు. అనంతరం టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి తలారి మణి మాట్లాడుతూ తనకు గ్రామ సర్పంచ్‌గా ఓటు వేసి గెలిపిస్తే ప్రజల సమస్యలను తీర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు.

కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షు లు గట్ల మీనయ్య, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కేసిరెడ్డి నర్సరెడ్డి, నాయకులు మాడిశెట్టి ఆనందం, తోకల తిరుమల్, మంచె రాజేశం, కర్ణవత్తుల దేవేందర్, ఆకుల గంగారాం, కొమిరె శంకర్, దావల రవి, నాగులపెల్లి రవి, పిడుగు లచ్చిరెడ్డి, చె ప్యాల గణేష్, దయ్యాల కమలాకర్, కాదాసు లక్ష్మ ణ్, పూదరి శ్రీనివాస్, అల్లూరి లచ్చిరెడ్డి, అల్లూరి రా జిరెడ్డి, ఎంగల కొమురయ్య, సింగారపు గంగారెడ్డి, పాల నర్సయ్య, పండుగు గంగారాం, దయ్యాల పె ద్దులు, ఇప్ప మల్లేశం, కొండయ్య, లవూడ్య మోహ న్, గుగులోత్ ఉపేంధర్, బోయిని గంగారాం, దేశదేని భూమేష్, ఆకుల గణేష్, సుడిగెపు మహేష్, ఇప్ప లావణ్య, నాయకులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...