ఘనంగా గోదాదేవి కల్యాణం


Mon,January 14, 2019 03:41 AM

సిరిసిల్ల రూరల్: తంగళ్లపల్లి మండలం నేరెళ్లలోని శ్రీరుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం, కస్బెకట్కూర్‌లోని వేణుగోపాలస్వామి ఆలయంలో ఆదివారం గోదాదేవి రంగనాథ కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు శ్రీమాన్ అమరవాది శ్రీనివాస వేణుగోపాలచార్యులు, కందూరి రమణ చార్యులు కన్నుల పండువలా కల్యాణోత్సవాన్ని జరిపించారు. ఇం దులో ఆలయ చైర్మన్ జూపల్లి పుష్పలత, ఎంపీటీ సీ మంత్రి కళ్యాణి, శ్రీవర్దన్ పాల్గొన్నారు.

ముస్తాబాద్: ధనుర్మాసంలో ప్రతియేటా గోదాదేవి రంగనాథస్వామి వారి కల్యాణాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పలు గ్రామాల్లోని సీతారామచంద్ర స్వామి కల్యాణాన్ని ఆలయాల్లో ఆదివారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా జరిపారు. మహిళలు మంగళహారతుల తో స్వామివారి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు అమరవాది లక్ష్మణాచార్యులు, మరింగంటి రంగాచార్యులు, అమరవాది శేషాచార్యులు, తూపురాని కృష్ణమాచార్యు లు, రామచంద్రచార్యులు, విజయసారథి చార్యు లు, ఆలయ పాలకవర్గం భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించారు.
గంభీరావుపేట: మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం గోదారంగనాథ స్వామివారి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించగా, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్యాణ మండపంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య క ల్యాణాన్ని వైభవంగా జరిపారు. కల్యాణానికి హాజరైన భక్తులకు అన్నదానం నిర్వహించారు.

సిరిసిల్ల కల్చరల్: సిరిసిల్ల పట్టణంలోని వేంకటేశ్వర ఆలయంలో గోదాదేవి కల్యాణ వేడుకలు ఘ నంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయం త్రం వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపా రు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో ఆలయ కమిటీ చైర్మన్ బైరి ప్రభాకర్, పూజారులు, భక్తులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...