క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట


Mon,January 14, 2019 03:41 AM

సిరిసిల్ల టౌన్: క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని జిల్లా క్రికెట్ అసోసియేషన్ (డీసీఏ)అధ్యక్షుడు పూర్మాణి లింగారెడ్డి అన్నారు. జిల్లా కేం ద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో స్టార్ క్రికెట్‌క్లబ్, డీసీఏ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎస్‌పీఎల్ టీ20క్రికెట్ పోటీలు ఆదివారం ప్రా రంభమయ్యాయి. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమానికి లింగారెడ్డి ముఖ్య హాజరై మాట్లాడారు. టోర్నమెంట్‌లు గ్రామీణ స్థాయిలోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడుతాయన్నారు. ప్రతిభఉన్న క్రీడాకారులు ఎంతోమంది ఉన్నప్పటికీ వారికి సరైన ప్రోత్సాహంలేక రాణించలేకపోతున్నారని అభిప్రాయం వ్యక్తంచేశారు. గ్రామీణ, జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గొనడం ద్వారా భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదుగుతారని సూచించారు. అండర్-14, 17విభాగాల్లో నిర్వహిస్తున్న ఈ పోటీలు సోమవారం నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. క్రీడాజట్లు తమ సత్తాచాటి విజయ తీరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వంకాయల కార్తీ క్, రామస్వామి, కీసరి నాగారజు, శ్రీధర్, రమణారెడ్డి, ద్యావనపల్లి రామస్వామి, పాండు, రిక్కుమల్లె సంపత్, తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్ టోర్నీ ప్రారంభం
యువ ఫ్రెండ్స్ యూత్ క్లబ్, మున్సిపల్ కౌన్సిలర్ బత్తుల వనజ ఆధ్వర్యంలో సుందరయ్యనగర్‌లో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను పట్టణ సీఐ శ్రీనివాసచౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ, క్రికెట్‌తో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. అంతర్జాతీయ వేదికలపై ఆడుతున్న వారంతా ఒకప్పుడు ఇలాంటి టోర్నమెంట్‌లలో పాల్గొని సత్తాచాటిన వారేనన్నారు. మొత్తం ఆరు జట్లు పాల్గొంటుండగా విజేతలకు ఈ నెల 26న బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. ఇందులో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, గుండ్లపెల్లి పూర్ణచందర్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మంచె శ్రీనివాస్, సామల దేవదాస్, బత్తుల రమే శ్, చందు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...